చినజీయర్ స్వామీజీ ఎవరు?

BPKNEWS

Who was Chinjiyar Swamiji? 

చినజీయర్ స్వామీజీ ఎవరు? 

హైదరాబాద్ కు ఉద్యోగం కోసం వచ్చి స్వామీజీగా ఎందుకు మారారు?

చాలా మందికి చినజీయర్ స్వామీజీ గురించి తెలిసే ఉంటుంది.

శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీయర్ స్వామి అన్న పేరు చాలా మందికి తెలియదు. 

కానీ చిన జీయర్ స్వామీజీ అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. 

ఆయన టీవీలలో కూడా పలు ఆధ్యాత్మిక ప్రవచనాలు ఇస్తూ ప్రజలకు ఆధ్యాత్మిక జ్ఞానాన్ని ప్రబోధిస్తున్నారు.

రెండు తెలుగు రాష్ట్రాలలోను చినజీయర్ స్వామీజీ తెలియని వారు ఉండరు. 

ఇటీవల హైదరాబాద్ సమీపంలోని ముచ్చింతల్ లో శ్రీరామానుజ సహస్రాబ్ది వేడుకలు నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగానే భారీ సమతా మూర్తి రామానుజాచార్యుల వారి పంచలోహ విగ్రహాన్ని ఏర్పాటు చేసారు.

ఇందుకోసం ప్రధాని మోడీ కూడా విచ్చేసారు.

దీనితో ఈ అంశం చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది.

ఈ భారీ విగ్రహం ఏర్పాటు చేయడంలో చినజీయర్ స్వామివారు కీలక పాత్ర పోషించారు.

ప్రస్తుతం అందరి దృష్టి, ఈ విగ్రహం పైనే ఉంది.

చినజీయర్ స్వామీజీ ఎవరు?

ఆయన జీవితం ఎక్కడ ప్రారంభమైంది?

అంటూ ఆయన గురించి తెలుసుకోవడం మొదలు పెట్టారు.

చినజీయర్ స్వామి ఓ సాధారణ వైష్ణవ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు.

1956 సo., నవంబర్ 3 తేదీన, దీపావళి రోజున ఆయన జన్మించారు.

అలమేలు మంగతాయారు, వేంకటాచార్యుల వారు చినజీయర్ స్వామి వారి తల్లి తండ్రులు. 

చినజీయర్ స్వామివారికి తల్లితండ్రులు మొదటగా పెట్టిన పేరు శ్రీమన్నారాయణాచార్యులు. 

ఆయన గౌతమ విద్యాపీఠంలో వైష్ణవ సంప్రదాయాలు,
వేద గ్రంధాలపైన శిక్షణ పొందారు.

అలాగే నల్లాన్‌ చక్రవర్తుల రఘునాథాచార్యస్వామి వద్ద సంస్కృతాన్ని, తర్క శాస్త్రాన్ని అభ్యసించారు.

అలాగే రాజమండ్రిలోనే ఓరియంటల్ స్కూల్ లో పదవ తరగతి వరకు చదువుకున్నారు. 

ఆ సమయంలోనే ఆయన తండ్రిగారు స్వర్గస్తులయ్యారు.

దీనితో ఆయనపై కుటుంబ పోషణ భారం పడింది.

దీనితో ఆయన ఏదైనా ఉద్యోగం చేయాలనుకున్నారు.

ఉద్యోగం కోసం ఒక్క చేతి సంచితో హైదరాబాద్ కు చేరుకున్నారు. 

మొదట్లో ఎన్నో చేదు అనుభవాల తరువాత ఒక చిన్న ఉద్యోగం లభించింది.

ఇక్కడే టైపు, షార్ట్ హ్యాండ్ ను కూడా నేర్చుకున్నారు.

తరువాత ఆ ఉద్యోగంలో మరో పైమెట్టు ఎక్కారు.

ఆ సమయంలో అనగా 1975 నాటికి ఓ సారి పెద్ద జీయర్ స్వామిజీ కాకినాడకు విచ్చేసారు.

ఓ యజ్ఞం నిమిత్తం ఆయన విచ్చేసారు.

యజ్ఞ క్రతువు సాగిస్తుండగా అనుకోకుండా పెద్ద జీయర్ స్వామిజీ తో   చినజీయర్ స్వామిజీకి పరిచయం ఏర్పడింది.

ఆ సమయంలో తనకు ఒక స్టెనోగ్రాఫర్ కావాలి అని పెద్ద జీయర్ స్వామిజీ కోరడంతో ఆ పని తానే చేస్తానని, అప్పటికే తానూ టైపు, షార్ట్ హ్యాండ్ నేర్చుకున్నానని చినజీయర్ స్వామిజీ తెలియజేశారు.

అలా ఇంట్లో తల్లి వద్ద అనుమతి తీసుకున్న శ్రీమన్నారాయణాచార్యులు పెద్ద జీయర్ స్వామీజీ వెంటే తమ ప్రయాణాన్ని ప్రారంభించారు.

ఆ తరువాత 23 సంవత్సరాల వయసులో ఆయన తల్లి అనుమతితోనే సన్యాసాశ్రమాన్ని స్వీకరించారు.

ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆయన గీతాజ్యోతి ఉద్యమాన్ని ప్రారంభించారు.

భగవద్గీత కు ప్రాచుర్యం తీసుకురావడంతో పాటు సమాజంలో బద్ధకాన్ని తొలగించి, ప్రజల మధ్య సౌభాతృత్వ భావనని పెంపొందించే లక్ష్యంతో ఈ ఉద్యమాన్ని ప్రారంభించారు. 

అయితే చినజీయర్ స్వామిజీ వారు ఇక్కడితో ఆగలేదు.

అంధుల కోసం కాలేజీలు కట్టించారు.

వారికి కళ్ళు లేకున్నా కంప్యూటర్ శాస్త్రంలో నిపుణులు అవ్వాలని కృషి చేసారు.

అంధులకు శిక్షణ ఇవ్వడం కోసం నిపుణులను కూడా నియమించారు.

సమస్త జీవకోటికి జ్ఞానాన్ని అందించే వేద విద్య సారాన్ని అందరికి అందించడం కోసం ఆయన ఎన్నో ఆశ్రమాలను స్థాపించారు.

వేద పాఠశాలలను గురుకుల పాఠశాలలుగా తీర్చిదిద్దారు.

అక్కడ అన్ని రకాల సదుపాయాలను ఏర్పాటు చేసారు.

ఆయన 12 నెలల్లో 12 భాషలను నేర్చుకున్నారు.

శ్రీరామ నగరం, శంషాబాద్ లో జిమ్స్ అనే ఆసుపత్రిలో ఉచిత వైద్య విధానాన్ని అమలు చేసి వైద్యరంగాన్ని కూడా అనుగ్రహించారు.

పొట్టకూటి కోసం హైదరాబాద్ కు వచ్చి, నేడు ప్రపంచానికే సమతామూర్తిని అందించిన ఘనత చినజీయర్ స్వామిజీ కే దక్కుతుంది.

జై శ్రీరామ్
జై భారత్
భారత్ మాతాకీ జై









Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts