సర్పంచ్‌గా ఎదిగే అవకాశాన్ని వదులుకోవద్దు

BPKNEWS

✍️✍️ *సర్పంచ్* : ✍️✍️ 

 సర్పంచ్ గా ఎదగండి వచ్చిన అవకాశమును వదలకండి


సర్పంచ్ అంటే ?

కేవలం సిమెంటు రోడ్లు, వీధిలైట్లు వేసి, వాటర్ ట్యాంక్ వాల్ విప్పడం కాదు?

 సర్పంచ్ అంటే ?

కేవలం నాయకుల విగ్రహాలకు దండలేసి, సభల్లో నాలుగు ముక్కలు మాట్లాడడం కాదు!

 సర్పంచ్ అంటే? 

కేవలం సంతకాలు పెట్టడం, ఖద్దరు బట్టలేసుకుని కారులో తిరగడం కాదు!

 సర్పంచ్ అంటే? 

మంత్రులకు,ఎమ్మెల్యే కు డబ్బాలు కొడుతూ ప్రజల సొమ్ము స్వాహా చేయడం కాదు!




 మరి సర్పంచ్ అంటే ఏంటి?

 
 సర్పంచ్ అంటే :- ప్రాథమిక అవసరాలైన విద్య, ఆరోగ్యం,
ఉపాధిని గ్రామంలో అందరికీ అందేలా చేయడం!

 సర్పంచ్ అంటే :- గ్రామంలో ఎడ్యుకేషన్ ని డెవలప్ చేయడం, విద్యార్థుల సమస్యలు దూరం చేయడం!

 సర్పంచ్ అంటే :- యువతకు దిశా నిర్దేశం చేసి నిరుద్యోగాన్ని పారద్రోలడం!

 సర్పంచ్ అంటే :- నీతినియమాలతో, కుల మతాలకతీతంగా ప్రజలని పరిపాలించడం!

 సర్పంచ్ అంటే :- గ్రామ ఆదాయాన్ని పెంచే అవకాశాలను వెతకడం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరియు ఎన్.జి.ఓ.ల నుండి వచ్చే ప్రతి రూపాయిని ఒడిసిపట్టడం! 

 సర్పంచ్ అంటే:- ప్రతి పని లో నాణ్యత వహిస్తూ & ఖర్చు చేసిన ప్రతిరూపాయి ప్రజాక్షేత్రంలో వివరించగలగడం!

 సర్పంచ్ అంటే:- భూమిని పరిరక్షించి రైతు, కూలీల మధ్య స్నేహభావం పెంచడం!   

 సర్పంచ్ అంటే :- గ్రామ మహిళలకు వారి పధకాలను వివరించి,సమానత్వం దిశగా అడుగులు వేయించడం!

 సర్పంచ్ అంటే :- పేద, వితంతు, వికలాంగులకు సాయం చేయడం, నిరుపేదలకు అనాధలకు చేయూతనివ్వడం!

 సర్పంచ్ అంటే :- ఊరంతా శానిటేషన్, ఊరిలోని వీధులన్నీ సోలార్ ప్లానింగ్, వీధిలోని ఇండ్లలో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్!

 సర్పంచ్ అంటే :- 24 గంటలు ఊరు కోసమే కలలు కనడం, 
ఆ కలలను నెరవేర్చుకోవడం,ఊరి ప్రజల గుండెల్లో దేవుడై గుడి కట్టుకోవడం!

 సర్పంచ్ అంటే:- వయసు రీత్యా కాదు ఆలోచనల రీత్యా పెద్దవాడై ఉండటం! 

 సర్పంచ్ అంటే :- గ్రామంలో పెద్దలకు 'సేవక బడిలా' ఆడవారికి 'రక్షక గుడిలా' పిల్లలకు 'తల్లి ఒడిలా' ఉండాలి!

➡️ సర్పంచ్ కి ఒక కలెక్టర్ కు ఉన్నంత విజన్ ఉండాలి!

➡️ సర్పంచ్ కి ఒక సైనికుడికున్నంత కవరేజ్ వుండాలి!

➡️సర్పంచ్ అంటే:- నిలువెత్తు నిజాయితీపరుడై ఉండాలి!

➡️ సర్పంచ్ కి ఉండాల్సింది ధనం కాదు! గుణం!

➡️ సర్పంచ్ అంటే:- మన గమ్యం కాకూడదు!
సర్పంచ్ అంటే! మన గమనమై ఉండాలి!

చదువుకొని గ్రామ అభివృద్ధికొరకు ఆలోచించే యువత 
ఒక్కఛాన్స్ ఇవ్వండి 🙏🙏













Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.

****************************************************

Follow Us on

Website : https://www.bpknews.online

Youtube Facebook Twitter Pinterest : BPKNEWS

Forms : https://bit.ly/bpknewsforms

Blogger : bpknewsofficial

****************************************************















Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Post a Comment

Previous Post Next Post