పేదల ఆశలను నిజం చేస్తున్నాం

BPKNEWS
We are making the hopes of the poor come true

పేదల ఆశలను నిజం చేస్తున్నాం

ఎమ్మెల్యే మల్లాది విష్ణు చేతుల మీదుగా హక్కుతో కూడిన ఇళ్ల దస్తావేజుల పంపిణీ

రాష్ట్రంలో సొంత ఇళ్లు లేనివారు ఎవరూ ఉండకూడదన్నదే సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆకాంక్ష అని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. వాంబే కాలనీ హెచ్ బ్లాక్ సచివాలయం నందు గురువారం ఓటీఎస్ లబ్ధిదారులకు రెండో విడత హక్కుతో కూడిన ఇళ్ల దస్తావేజుల పత్రాల పంపిణీ ఎమ్మెల్యే చేతులమీదుగా జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసే ఏ ఒక్క ఆలోచన అయినా.. లక్షల మంది పేదలకు లబ్ధి చేకూరే విధంగా ఉంటుందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. సంపూర్ణ గృహ హక్కు పథకం అందుకు ఒక చక్కని ఉదాహరణగా చెప్పుకొచ్చారు. ఇటువంటి బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్ర గృహ శాఖామాత్యులు చెరుకువాడ శ్రీరంగనాథరాజు చేతులమీదుగా వాంబేకాలనీలో ప్రారంభించుకోవడం జరిగిందన్నారు. 250 మందికి మంత్రివర్యుల చేతుల మీదుగా నాడు దస్తావేజులు పంపిణీ చేయగా.. నేడు మరో 200 మంది వరకు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు. మరో నెల రోజుల్లో హెచ్ బ్లాక్ లోని ప్రతిఒక్కరికీ సంపూర్ణ హక్కుతో కూడిన దస్తావేజుల పంపిణీ పూర్తి చేస్తామని స్పష్టం చేశారు. 

దివంగత మహానేత వైఎస్సార్ చెప్పిన ఒక్క మాటతో నాడు వాంబే కాలనీలో 1,056 మంది పేదలు గృహ యజమానులుగా మారారని ఈ సందర్భంగా మల్లాది విష్ణు గుర్తుచేశారు. కానీ తర్వాత వచ్చిన తెలుగుదేశం ప్రభుత్వం 105 మంది లబ్దిదారుల వద్ద నుంచి రూ. 60 వేలు చెల్లించుకుని పట్టాలను పంపిణీ చేయకుండా మోసం చేసిందన్నారు. గత ప్రభుత్వంలో నాలుగు సార్లు ఫైల్ పంపించినా.. అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు పక్కన పడేశారన్నారు. పైగా అధికారంలో ఉన్న 14 ఏళ్లు పేదల గూర్చి ఆలోచన చేయకుండా.

మరలా ముఖ్యమంత్రి అయితే చేస్తానంటూ ప్రతిపక్ష పార్టీ నేతలు ప్రజలను మభ్యపెడుతున్నారన్నారు. కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఎన్నో సంవత్సరాలుగా పరిష్కారంకాని హెచ్ బ్లాక్ కాలనీవాసుల సమస్యకు పరిష్కారం లభించిందని మల్లాది విష్ణు అన్నారు. ఇదే సమయంలో ప్రతిపక్ష పార్టీ నాయకులు ఎన్ని విష ప్రచారాలు చేసినా.

 విజ్ఞతతో ముందుకొచ్చి డబ్బులు చెల్లించిన ప్రతిఒక్కరినీ ఆయన అభినందించారు. చేతుల మారిన 535 మందికి కూడా మేలు చేకూర్చే విధంగా రూ. 40 వేలు కాకుండా రూ. 20 వేలు చెల్లించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం శుభపరిణామని మల్లాది విష్ణు అన్నారు. ఓటిఎస్ విధానంలో డాక్యుమెంట్ కి సొంత ఆస్తి విలువ ఉంటుందని పేర్కొన్నారు. ఆస్తికి అసెస్మెంట్ నెంబర్ వస్తుందని.. దానితో అన్ని హక్కులు వర్తిస్తాయని తెలిపారు. సాధారణంగా రిజిస్ట్రేషన్ కు రూ. 70 - 80 వేల రూపాయల వరకు ఖర్చు అవుతుందని.. ఓటిఎస్ పథకం ద్వారా ఉచితంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ చేయడంతోపాటు రూ. 20 - 30 లక్షల ఆస్తికి హక్కుదారులు అవుతారన్నారు. 

నిరుపేదల సొంతింటి కల సాకారం చేయడమే సీఎం వైఎస్ జ‌గ‌న్మోహ‌న్‌ రెడ్డి అభిమతమని ఈ సందర్భంగా మరోసారి స్పష్టం చేశారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఉమ్మడి రమాదేవి వెంకట్రావు, నార్త్ తహసీల్దార్ దుర్గాప్రసాద్, హౌసింగ్ డీఈ రవికాంత్, ఆర్.ఎస్.నాయుడు, లబ్ధిదారులు పాల్గొన్నారు.







Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts