టిడ్కొ గృహాలను సిద్ధం చేయండి

BPKNEWS


1.టిడ్కో అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్న ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్
2.వైద్యం నిమిత్తం రామకృష్ణకు ఎల్వోసీ ని అందిస్తున్న దృశ్యం


టిడ్కొ గృహాలను సిద్ధం చేయండి

ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ భీమవరం,

టిడ్కొ గృహాలను సిద్ధం చేయాలని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అధికారులను ఆదేశించారు. 

ఈ మేరకు మంగళవారం రాత్రి స్థానిక క్యాంపు కార్యాలయంలో అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

అనంతరం ఆయన మాట్లాడుతూ మొదటి విడతగా 19 20 మంది లబ్ధిదారులకు ఫ్లాట్ ల ను అప్పగించేందుకు చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 

ఇందులో భాగంగా లబ్ధిదారులకు రుణ ప్రక్రియను వేగవంతం చేయడం జరిగిందని తెలిపారు. 

అదే మాదిరిగా తాడేరు నుండి గృహాల వరకు రోడ్డును సైతం నిర్మిస్తున్నామని అన్నారు. 

ఈ సమీక్షలో టిడ్కో డి ఈ పాపా రావు, జేఈ పూర్ణచంద్రరావు లు పాల్గొన్నారు.


వైద్యానికి పెద్దపీట

రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రజల ఆరోగ్యానికి భద్రత కల్పిస్తూ వైద్యానికి పెద్దపీట వేశారని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అన్నారు. 

వీరవాసరం మండలం తలతాడి తిప్ప గ్రామానికి చెందిన కండిబోయిన రామకృష్ణకు వైద్యం నిమిత్తం ముందస్తుగా రూ 60 వేల విలువగల ఎల్.ఓ.సి.ని మంగళవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ అందించారు.


ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ లో లేని వ్యాధులకు వైద్యం నిమిత్తం ముఖ్యమంత్రి సహాయనిధి నుండి నిధులు మంజూరు చేస్తూ వారికి వైద్యాన్ని అందిస్తున్నామని అన్నారు. 

పేదలకు కార్పొరేట్ వైద్యాన్ని ఉచితంగా అందించేందుకు ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రారంభించిన ఆరోగ్యశ్రీ పథకాన్ని నేడు ఆయన తనయుడు, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మరింతగా పథకం విస్తరింపజేసి మన రాష్ట్రంతో పాటు, ఇతర రాష్ట్రాల లోని పలు కార్పొరేట్ ఆసుపత్రుల లో సైతం ఆరోగ్యశ్రీ పథకంలో దాదాపుగా మూడు వేల వ్యాధులకు ఉచితంగా వైద్యాన్ని అందిస్తున్నారని అన్నారు.





Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts