AMC Chairman Thirumani Yedukondalu, who paved the road for Tidco homes
టిడ్కో గృహాలకు రోడ్డు శంకుస్థాపన చేసిన ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు.
టిడ్కో గృహాలకు రోడ్డు శంకుస్థాపన చేసిన ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు గారు, నాకు ఈ అవకాశం కల్పించిన మన భీమవరం నియోజకవర్గ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
అలాగే భీమవరం అభివృద్ధికి ఆయన ఏనలేని కృషి చేస్తున్నారు.
పట్టణంలోని టిడ్కో లబ్దిదారులకు మేలు జరిగేలా రహదారి నిర్మాణం చేపటామని ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు.
ఈ మేరకు శుక్రవారం తాడేరు వంతెన దగ్గర రూ.65 లక్షలతో నిర్మించే బీటీ రోడ్డు పనులకు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో ఏఎంసీ చైర్మన్ తిరుమాని ఏడుకొండలు శంకుస్థాపన చేశారు. అనంతరం ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ మాట్లాడుతూ త్వరలోనే మొదటి విదడ టిడ్కో లబ్దిదా రులకు ప్లాట్లను అప్పగిస్తామన్నారు. ఇందు కోసం ముందుగానే రోడ్డు నిర్మాణ పనులను చేపట్టినట్లు తెలిపారు. తాడేరు వంతెన దగ్గర నుండి టిడ్కో గృహాల వరకు ముందుగా బీటీ రోడ్డు నిర్మిస్తున్నామని చెప్పారు. మొదటి విడతలో సుమారు 1,924 మంది లబ్ధిదారలకు ప్లాట్ లను అప్పగించనున్నారు. ఇప్పటికే పాట్లకు సంబంధించి, పూర్తిస్థాయిలో అన్ని మౌలిక వసతులను కల్పించినట్లు తెలిపారు. కరోనా వల్ల రెండు సంవత్సరాలుగా అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చిందని, అందుకే ప్లాట్లు అప్పగింతలో కొంతమేర జాప్యం జరిగిందన్నారు. లబ్దిదారులకు ఇప్పటికీ బ్యాంకుల ద్వారా రుణాల ప్రక్రియను వేగవంతం చేశామని చెప్పారు. టిడ్కో గృహ పథకంలో లబ్ధిదారులలో పండుగ వాతావరణంలో గృహ ప్రవేశాలు చేయిస్తాము. అదే స్థాయిలో వారికి ఏ ఇబ్బందు లు లేకుండా చర్యలు తీసుకుంటామని వివరించారు. ముఖ్యంగా తాగునీరు, విద్యుత్తు సంబంధించి అన్ని వసతులను ఏర్పాటు చేశామన్నారు.
త్వరలో తాడేరు వంతెన నిర్మాణం
వంతెన నిర్మాణానికి ప్రభుత్వం రూ. కోటీ 10 లక్షల నిధులను మంజూరు చేసింది, ప్రస్తుతం టెండర్ దశలో ఉందని ఎమ్మెల్వే గ్రంధి శ్రీనివాస్ తెలిపారు. కాగా వంతెన నిర్మాణ సమయంలో ప్రజల రాకపోకలకు సంబంధించి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలిస్తున్నామన్నారు. ముందుగా ఆయన తాడేరు వంతెన దగ్గర ఉన్న ప్రత్యామ్నాయ ప్రాంతాన్ని పరిశీలించారు. కార్యక్రమంలో డీసీ.ఎం.ఎస్ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, రాష్ట్ర గౌడ కార్పొరేషన్ డైరెక్టర్ కామన నాగేశ్వర రావు, మున్సిపల్ కమిషనర్ ఎం. శ్యామల, టిడ్కో ఈ.ఈ. ఎం. స్వామినా యుడు, డీ.ఈ. యు.పాపారావు, జే.ఈ. పూర్ణచంద్రరావు, వైసీపీ నాయకులు తోట భోగయ్య, కోమటి రాంబాబు, నామన మహేష్, కొండేటి సుధాకర్, వెల్లబోయిన సూర్య ప్రకాష్, కోయ తాతాజీ. కందికల్ల ఏద్వర్డ్ , ఆకుల సుబ్బలక్ష్మి, ముద్దల కరుణ కుమార్, నల్లం రాంచాలు, నాసర్ల ముత్యాలరావు, సంబలదీవి షకీరా, కర్రెడ్డి వెంకటేశ్వర్లు, గాదిరాజు సుబ్రమణ్యంరాజు, కొల్లి ప్రసాద్ సాలా శ్రీను, పాలపర్తి జోనా, గంటా ముంధరకుమార్, పోతుల విను. రాజు, నాను పాపయ్య, వనల గాంధీ, రాట్నాల నాగేశ్వరరావు, సాలా అశోక్, నందమూరి అంజనేయులు, దిగురు పాటి రాజు, పెన్చెరీ ప్రసాద్, తాళ్ళ పూడి పరమేశ్వరరావు, షేక్ తుంపాల శ్రీనివాస్, రెడ్డి సత్తిబాబు, తదితరులు పాల్గొన్నారు.
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications