హనుమాన్ పేట వెహికల్ డిపోలో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా....

BPKNEWS

By the Municipal Corporation at Hanuman Peta Vehicle Depot

హనుమాన్ పేట వెహికల్ డిపో నందు నగరపాలక సంస్థచే నూతనంగా కొనుగోలు చేసిన 3 జె.సి.బి వాహనములను నగర మేయర్ శ్రీమతి రాయన భాగ్యలక్ష్మి అధికారులతో కలిసి ప్రారంభించారు. 


ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పారిశుధ్య పరిస్థితులను మెరుగుపరచాలనే లక్ష్యంతో రూ.110 లక్షల 15వ ఆర్ధిక సంఘ నిధులతో సదరు వాహనాలు కొనుగోలు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి వాహనమునకు అమర్చబడిన ఎక్సకలేటర్, లోడర్ బకెట్ ద్వారా డ్రెయిన్ లలో పేరుకుపోయిన సిల్ట్ తొలగించుట, చెత్త మరియు డెబ్రిస్ తొలగించుటకు ఉపయోగకరంగా ఉంటుందని వివరించారు. 
పారిశుధ్య కార్యక్రమములు చేపట్టి పూర్తి చేయుటకు నాణ్యమైన ఫలితాలు సాధించుటకు యంత్రముల వినియోగము దోహదపడునని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో మన నగరం 3వ ర్యాంక్ సాధించుట జరిగిందని గుర్తు చేస్తూ, అధికారులు సిబ్బంది సమిష్టి కృషితో ఈ ఏడాది మొదటి ర్యాంక్ సాదించేవిధంగా ప్రణాళికలు సిద్దం చేసుకోవాలని అధికారులకు సూచించారు. 

 పనితీరు ఎప్పటికప్పుడు పరిశీలించవలెనని, చిన్న చిన్న మరమ్మత్తులను వెంటనే పూర్తి చేసి వాహనములు ఎల్లప్పుడూ మంచి కండిషన్లో ఉండునట్లుగా చూడవలెనని ఇంజనీరింగ్, శానిటరీ అధికారులను ఆదేశించారు. 
                                                                                                                                                                      కార్యక్రమములో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.కోటేశ్వరరావు మరియు ఇతర అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.







Comments

Popular Posts