పొగాకు రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే దిశలో ఏపీ

BPKNEWS BPKNEWS

 "పొగాకు రహిత ప్రదేశం" అనే అంశంపై నిన్న మా ఏరియాలోని స్కూల్ పిల్లలకు అవగాహన కల్పించటం జరిగింది.

పొగాకు రహిత ప్రదేశాలు ఉన్నాయా అసలు గ్రామాలలో.
 8 నుండి10 సం వయసు పిల్లలు వీళ్ళు.చిన్నపిల్లలు కదా వీరికేమి తెలుస్తుంది పొగాకు గురించి చెప్తే అనుకున్నాను.

కానీ నాకన్నా వారికే ఎక్కువ విషయాలు తెలుసని అర్ధమయింది.
పిల్లలు బీడీలు,సిగరెట్స్,పాన్ పరాగ్,కైనీ,గుట్కాలు కంపెనీ పేర్లు తో సహా చెప్తుంటే నవ్వాలో ఏడవాలో తెలియని పరిస్థితి.

మీకు ఎలా తెలుసు అని అడిగితే అమ్మా నాన్న లు వీరితో తెప్పించుకుంటారట కొట్టులో.


మద్యపానం అంటే తెలుసా అని అడిగితే మందు సీసాల రేటు కూడా తెలుసని చెప్పాడు ఒక పిల్లవాడు.

ఎలా తెలుసని అడిగితే నాన్న వాళ్ళు తాగి సీసా పడేస్తే వాటిని తెచ్చి వాటి రేటు చూసి ఫ్రెండ్స్ కి చెప్తాడట ఏ సీసా ఎంత రేటో...

దీనికి కారణం ఎవరు.
పిల్లలలకు మనం ఎలాంటి సమాజాన్ని అందిస్తున్నాము.

పొగాకు వల్ల కలిగే నష్టాలు,అనారోగ్యం గురించి చెప్పి,వాటికి దూరంగా ఉండాలి ఇంకెప్పుడు పెద్దవాళ్ళు తెచ్చిపెట్టమంటే మీరు వెళ్లవద్దు అని చెప్పివచ్చాను.

తల్లిదండ్రులను, చుట్టూ వుండే పరిసరాలను చూస్తూ పెరుగుతారు పిల్లలు.


పొగత్రాగితే నేరం అంటారు.కానీ ఎక్కడా పోగాకు పంట వేయడం అడ్డుకోవడం లేదు.

మద్యపానం ఆరోగ్యానికి హానికరం అంటారు.
కానీ సందుకొక షాప్ పెట్టుకోటానికి పర్మిషన్ లు....

సినిమాలలో,టీవీ లలో మాత్రం స్క్రోలింగ్ లు వేస్తారు..
"ధూమపానం మద్యపానం ఆరోగ్యానికి హానికరం"











Like 👌 Share 🤳 Subscribe 👍. Provides political information on the channel.





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Post a Comment

Previous Post Next Post