రీసర్వే.. మరింత వేగవంతం
రీసర్వే అనేక కొత్తకష్టాలను తెచ్చిపెట్టింది.
గతంలో రీసర్వే పూర్తయిన చోట్ల పరిస్థితిని సరిదిద్ది మిగిలిన గ్రామాల్లో వేగంగా పారదర్శకంగా ఆ ప్రక్రియను పూర్తి చేసేందుకు కూటమి ప్రభుత్వం చర్యలు తీసుకుంది.
జిల్లాలో మండలానికి ఒకటి చొప్పున 20 గ్రామాలను పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని ఈ ఏడాది జనవరి నాటికి రీసర్వే పూర్తి చేశారు.
ఏప్రిల్లో మొదలైన రెండో విడత రీసర్వే ప్రస్తుతం జరుగుతోంది.
దీన్ని జులై నెలాఖరుకి పూర్తి చేసేలా వేగంగా నిర్వహిస్తున్నారు.
తమ భూమి విస్తీర్ణం తగ్గిపోయిందని, దస్త్రాల ప్రకారం అప్పగించాలని చాలా మంది రైతులు అధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు.
దశాబ్దాలుగా ఉన్న భూమి తగ్గిపోవడం ఏమిటని కొంత మంది ఆందోళన చెందుతున్నారు.
అలాంటి వాటిని పరిష్కరించేలా అధికారులు తమ వంతు కృషి చేస్తున్నారు.
గతంలో అధిక శాతం మందికి ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే రీసర్వే చేశారనే విమర్శలొచ్చాయి.
కొంత మందికి సమాచారం ఇచ్చినా వారు అందుబాటులో లేని సందర్భాలు ఉన్నాయి.
దీంతో ఇప్పుడు చాలా ముందస్తుగా సమాచారం ఇచ్చి రీసర్వే జరిగినప్పుడు వారినీ భాగస్వాములు చేస్తున్నారు.
సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి అందరి సమక్షంలో కచ్చితమైన హద్దులు నిర్ణయిస్తున్నారు.
గుర్తించి సరిచేస్తున్నాం.. గతంలో కొన్ని పొరపాట్లు దొర్లిన విషయం వాస్తవమే.
కొన్ని చోట్ల భూమి విస్తీర్ణం తగ్గిందని చాలా మంది చెబుతున్నారు.
దస్త్రాల్లో ఉన్న ప్రకారం భూమి చూపాలంటున్నారు.
మూడో విడత రీసర్వే ఆగస్టులో ప్రారంభించి డిసెంబరు చివరి నాటికి పూర్తి చేయాలని అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని సర్వే విభాగం ఏడీ జాషువా తెలిపారు.