ఒక బిడ్డతో సరిపెట్టుకోవద్దు
ఒక బిడ్డతోనే సరిపెట్టుకోవడం వల్ల భవిష్యత్తులో యువత సంఖ్య తగ్గిపోతుందని భీమవరం కలెక్టర్ చదలవాడ నాగరాణి అన్నారు.
కలెక్టరేట్లో బుధవారం వైద్య ఆరోగ్య ఆధ్వర్యంలో జరిగిన సమావేశానికి ఆమె అధ్యక్షత వహించి మాట్లాడారు.
శిశు జననాలు పెరిగేలా శాఖ ప్రజల్లో పెద్ద ఎత్తున అవగాహన పెంచాలని సూచించారు.
ప్రభుత్వాసుపత్రుల్లో ప్రసవాలు జరిగేలా ప్రోత్సహించాలన్నారు.
అతిసారం బారిన పడకుండా అందరూ ఆరోగ్య శుభ్రత పాటించాలని సూచించారు.
ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా ఈ నెల 11న నిర్వహించిన కార్యక్రమంలో లక్కీడీప్ ద్వారా ఎంపికైన పది మంది తల్లులకు నగదు పురస్కారాలు అందించారు.
అనంతరం ఆరోగ్యశాఖ రూపొందించిన గోడపత్రం ఆవిష్కరించారు.
కార్యక్రమంలో వైద్య ఆరోగ్య శాఖ జిల్లా అధికారిణి గీతాబాయి, డీసీహెచ్ ఎస్ సూర్యనారాయణ పాల్గొన్నారు.