భీమవరం: సమస్యలు పరిష్కారం కోరుతూ కలెక్టర్కు వినతి
రాష్ట్రంలో 2 గ్రామ సచివాలయాలను కలిపి ఒక క్లస్టర్ చేసి వీఆర్వోను నియమించడంతో సుమారు 7,500 మంది క్యాడర్ సామర్ధ్యం తగ్గిపోతుందని వీఆర్వోల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు భూపతిరాజు రవీంద్రరాజు అన్నారు.
దీనిపై భీమవరం జిల్లా కలెక్టర్ నాగరాణికి వీఆర్వోల సంఘం నాయకులు వినతి పత్రాన్ని అందించారు.
అధ్యక్షుడు మాట్లాడుతూ.. ప్రస్తుత విధానంలో సచివాలయానికి ఒక వీఆర్వో విధానాన్ని కొనసాగించాలన్నారు.