పరిశ్రమలను ప్రమాదరహితంగా నిర్వహించాలి: కలెక్టర్
పశ్చిమ గోదావరి పరిశ్రమలను ప్రమాదరహితంగా నిర్వహించేందుకు నిబంధనల మేరకు మాక్ డ్రిల్ నిర్వహించి అవగాహన కల్పించాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు.
సోమవారం భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన జిల్లా క్రైసిస్ గ్రూప్ సభ్యులు, పరిశ్రమల ప్రతినిధులులతో కలిసి జిల్లా క్రైసిస్ గ్రూప్ సమావేశాన్ని నిర్వహించారు.
ప్రమాదకరమైన పరిశ్రమల్లో మాక్ డ్రిల్ ను నిర్వహించి అవగాహన కల్పించాలన్నారు.