క్రాంతి హై స్కూల్ పూర్వ విద్యార్థి కి సెంట్రల్ గవర్నమెంట్ జాబ్
తేది.12.12.24 కోరుకొల్లు గ్రామం,
క్రాంతి హై స్కూల్ పూర్వ విద్యార్థి, ఆవకూరు గ్రామ కాపురస్తులు శ్రీ వడ్డీ సీతారామయ్య (EX. సర్పంచ్)గారి మనవడు, శ్రీమతి శ్రీ వడ్డీ కాకుళ్లేశ్వర రావు, నాగ మల్లేశ్వరి దంపతుల కుమారుడు శ్రీ వడ్డీ సాయి నరసింహ స్వామి B .Tech,
ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం పొందిన సందర్బంగా,
శ్రీ చన్నంశెట్టి క్రిష్ణ, క్రాంతి హై స్కూల్ కరెస్పాండంట్ గారు, అభినందించారు.
ఇతనికి CBI లోను, ఎయిర్ పోర్ట్ లోను, ఇన్ కమ్ టాక్స్ డిపార్ట్మెంట్ లోను, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ అవకాశాలు వచ్చాయి.
IT డిపార్మెంట్ ఎంచుకోవటం అయింది.
ఇతను పల్లెప్రాంతానికి ,వ్యవసాయ కుటుంబానికి చెందినప్పటికి,
స్వయం కృషితో ఏ కోచింగ్ కు ఎక్కువగా వెళ్లకుండా, ఇంటి వద్దనే ఉండి, తల్లి తండ్రులు ప్రోత్సహంతో, ఈ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం పొందటం జరిగింది.
వడ్డీ సాయి నరసింహ స్వామి ఇలాంటి విజయాలు మరెన్నో పొందాలి అని,
ఈ ఉద్యోగం లో ఉన్నత స్థాయికి చేరుకోవాలి అని,
క్రాంతి హై స్కూల్ కరెస్పాండంట్ చన్నంశెట్టి క్రిష్ణ గారు, ప్రిన్సిపాల్ అజేష్ బాబు గారు, ఉపాధ్యాయులు, విద్యార్థులు కోరుచూ, అభినందనలు తెలియజేశారు.
#kranthihighschool #highschool #school #krishnasir #ajeshbabusir