Prabhakar Babu will retire on July 31

జులై 31 న పదవీ విరమణ చేయనున్న ప్రభాకర్ బాబు

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు వ్యవస్థకు రెండు కళ్ళు లాంటివి అని కలిదిండి మండల విద్యాశాఖ అధికారి పిడుగు ప్రభాకర్ బాబు అన్నారు.

జులై 31 న పదవీ విరమణ చేయనున్న ప్రభాకర్ బాబును కలిదిండి మండల ప్రవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం స్థానిక శశి స్కూల్ ఆవరణలో ఆయనకు పూలమాలలు, జ్ఞాపిక మరియు దుశ్శాలువాలతో ఘనంగా సన్మానించారు.

prabhakar babu

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ ప్రైవేట్ స్కూల్ డెమోక్రాట్స్ అసోసియేషన్ ఏలూరు జిల్లా గౌరవాధ్యక్షులు కృష్ణ మాట్లాడుతూ తన సర్వీస్ కాలంలో ఒక్కరోజు కూడా సెలవు ఉపయోగించుకోకుండా ప్రభుత్వ ఉద్యోగులలో అరుదుగా కనిపించి ఎంతోమందికి ఆదర్శంగా నిలిచిన గొప్ప వ్యక్తి మన ప్రభాకర్ బాబు అన్నారు.

కైకలూరు డివిజన్ అధ్యక్షులు ఎ.కోటేశ్వరరావు మాట్లాడుతూ ప్రభాకర్ బాబు తన మంచితనంతో అందరి మనసుల్లో నిలిచిపోతారని ఇలాంటి వ్యక్తులు వ్యవస్థలు బాగుపడటానికి ఎంతో అవసరం అన్నారు.

ఈ కార్యక్రమానికి ఆతిథ్యమిచ్చిన శశి స్కూల్ అధినేత సత్యనారాయణ రాజు మాట్లాడుతూ ప్రవేట్ స్కూల్ యాజమాన్యాలను సమన్వయంతో విద్యా శాఖకు పంపించవలసిన వివిధ సమాచారాలపై అవగాహన కల్పిస్తూ అందరికీ సహకరించిన ప్రభాకర్ బాబు లాంటి వ్యక్తి మనకు విద్యాశాఖ అధికారిగా పనిచేయడం మన అదృష్టం అన్నారు.

కోరుకొల్లు కే జీ ఆర్ స్కూల్ కరస్పాండెంట్ కనక దుర్గ భవాని మాట్లాడుతూ ఒక ఆదర్శమైన వ్యక్తి ప్రభాకర్ బాబును సన్మానించుకోవడం మనందరి అదృష్టం అని, ఆయన శేష జీవితం పరిపూర్ణమైన ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు.

సన్మాన గ్రహిత ఎంఈఓ ప్రభాకర్ బాబు మాట్లాడుతూ అప్స డెమొక్రాట్స్ ఆధ్వర్యంలో ఇంత ఘనంగా నన్ను సన్మానించడం చాలా సంతోషంగా ఉందన్నారు.

కలిదిండి ఎంఈఓ గా పనిచేస్తున్న కాలంలో అన్నిస్కూల్స్ యాజమాన్యాలు విధి నిర్వహణ తనకు సహకరించినందుకు ధన్యవాదాలు తెలిపారు.

ప్రభుత్వ మరియు ప్రైవేటు పాఠశాలలు వ్యవస్థకు రెండు కళ్ళు లాంటివని, అన్ని వృత్తులలో ఉపాధ్యాయ వృత్తి చాలా సంతృప్తిని కలిగించేదని, అలాంటి వృత్తిని ఎంచుకున్న మనమందరం అదృష్టవంతులం అన్నారు.

రేపటి పౌరులను తీర్చిదిద్దే ఈ క్రమంలో సర్వీస్ లో జాయిన్ అయిన రోజే సెలవు పెట్టకూడదని నిర్ణయం తీసుకున్నారని దానికి కట్టుబడి ఇప్పటివరకు సెలవును ఉపయోగించుకోలేదని ఆయన తెలిపారు.

అన్ని యాజమాన్యాలు విద్యార్థులు భవిష్యత్తుకు నిరంతరం శ్రమిస్తే జీవితాంతం మనలను గుర్తుపెట్టుకుంటారని ఆయన అన్నారు.

ఈ కార్యక్రమంలో కలిదిండి మండలానికి చెందిన ప్రైవేట్ స్కూల్స్, శ్రీ శాంతి చిల్డ్రన్ స్కూల్, కలిదిండి పబ్లిక్ స్కూల్, వివేకానంద స్కూల్, క్రాంతి స్కూల్, కొండంగి వివేకానంద స్కూల్, ములలంక కు చెందిన శ్రీ శాంతి హై స్కూల్, అను హైస్కూల్, నవోదయ స్కూల్, మిన్నీ యుపి స్కూల్ తదితర స్కూల్స్ యాజమాన్యాలు పాల్గొన్నారు.

#bpknews #bpknewsofficial #baswaniassociates #bhimavaram #baswanipavankumar #baswanipavankumarmla #baswanipavankumarmlabhimavaram #bhimavarammla #mlabhimavaram #jbp #jaibhimraobharatparty #jaibhimraobharat #jaibhim #jada #jadasravan #jadasravankumar #highcourt #highcourtlawyer #lawyer

Prabhakar Babu will retire on July 31

BASWANI ASSOCIATES JOBS !

BPKNEWS Like Share Subscribe for Latest Updates

For the latest news & updates: Subscribe :

Visit our Website : https://www.bpknews.in/

Youtube : https://www.youtube.com/channel/UCtUIIvCeHS3y-lHZ9uUCjUQ?sub_confirmation=1

Like in Facebook : https://www.facebook.com/bpknewsbza

Comment in Facebook Page : https://www.facebook.com/bpknews9/

Give me a heart in Instagram : https://www.instagram.com/bpknews/

Follow me on Threads : https://www.threads.net/@bpknews

Follow us on Twitter : https://twitter.com/bpknews

Submit your query in Forms : https://forms.gle/w3krUPVW7yYWpQmb6

Touch in Blogger : https://bpknewsofficial.blogspot.com/

Written by B Pavan Kumar.
BPKNEWS

Comments

Popular Posts