త్వరలో ఇంటింటా నైపుణ్య గణన!
AP: జనాభా లెక్కింపు తరహాలో ఇంటింటా నైపుణ్య గణన చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తోంది.
గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ద్వారా నిరుద్యోగుల విద్యార్హతలు, నైపుణ్యాల వివరాలను నమోదు చేయనుంది.
వీటి గుర్తింపునకు ఆన్‌లైన్ పరీక్షలు కూడా నిర్వహించనున్నట్లు సమాచారం.
ఆ తర్వాత కంపెనీల అవసరాలకు తగ్గట్లుగా వారికి వివిధ నైపుణ్య శిక్షణనివ్వనున్నట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి.