పవన్ కళ్యాణ్ నువ్వు ఎప్పటికీ చంద్రబాబుకి దత్తపుత్రుడివే

BPKNEWS
పవన్ కళ్యాణ్ నీవు చంద్రబాబుకు ఎప్పటికీ దత్తపుత్రుడివే,  నువ్వు బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ చంద్రబాబు, బ్రాండ్ అంబాసిడర్ ఆఫ్ టీడీపీ..! మీ అవసరం రైతులకు లేదు. ఈ రాష్ట్రానికీ లేదు  - రాప్తాడు ఎమ్మెల్యే #తోపుదుర్తి_ప్రకాష్_రెడ్డి గారు..

ఈరోజు వైయస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో పార్టీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి ప్రెస్‌మీట్‌.. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలను ఆదుకుంటున్నాం వారికి రూ.7 లక్షల చొప్పున పరిహారం ఇస్తున్నాం కాబట్టి అనంతపురం జిల్లాకు వచ్చి ప్రజలను మోసం చేయొద్దు.మీ సినిమాలు చూస్తున్న యువతను తప్పుదోవ పట్టించొద్దు
మీ వెంటే వస్తున్న అభిమానుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు
వారి భవిష్యత్తును ఏ మాత్రం ఫణంగా పెట్టొద్దు
నీవు చంద్రబాబుకు ఎప్పటికీ దత్తపుత్రుడివే
చంద్రబాబును, ఆయన కొడుకును గద్దెనెక్కించే ప్రయత్నం చేయొద్దు పవన్‌కళ్యాణ్‌. 

👉ఇది రైతు పక్షపాత ప్రభుత్వం. వారికి ఎన్నో పథకాలు
రైతులకు అడుగడుగునా అండగా రైతు భరోసా కేంద్రాలు
విత్తనం మొదలు పంటలు అమ్ముకునే వరకు రైతులకు చేదోడుగా రైతు భరోసాగా ఏటా రూ.13,500 చొప్పున పెట్టుబడి సాయం ఎప్పటికప్పుడు ఇన్‌పుట్‌ సబ్సిడీ. సున్నా వడ్డీ పంట రుణాలు ఉచిత పంటల బీమా.. ఇలా రైతులకు ఎన్నెన్నో చేస్తున్నాం మూడేళ్లుగా వర్షాలూ కురుస్తున్నాయి అంతా సుబిక్షంగా ఉంది.

●మీకు కనిపించడం లేదా.?
 
టూరిస్టుగా వచ్చినట్లు ఒక అయిదారు గంటల కార్యక్రమం. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఒక 30 లక్షల దాకా సపోర్టు మనీ అంటూ వచ్చిన పవన్‌కళ్యాణ్‌ రాజకీయాల ప్రస్తావన లేదంటూనే రాజకీయాలు మాట్లాడారు. ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. ఇవాళ మీరు పుట్టపర్తిలో ల్యాండ్‌ అయిన దాని పక్కనే ఉన్న బుక్కపట్నం చెరువు నుంచి మీరు గ్రామసభ నిర్వహించిన మన్నీల వరకు ప్రతి చెరువు నీటితో కళకళలాడుతోంది. అవేవీ మీకు కనిపించడం లేదా?

●ఆనాడు ఎక్కడికి పోయారు.?
 
మీ మిత్రుల ప్రభుత్వ హయాంలో కోకొల్లలుగా రైతుల ఆత్మహత్యలు జరిగాయి. అప్పుడు అధిక వడ్డీలు కట్టలేక, పంటలకు గిట్టుబాటు ధర లేక 435 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నా, మీరు ఏరోజూ పరామర్శకు రాలేదు. సినిమాలు తీస్తూ బిజీగా ఉన్నారేమో. మీకు రైతుల ఆత్మహత్యలు ఇప్పుడే గుర్తుకు వచ్చాయా?.
 అప్పుడు మీరు అండగా నిలబడిన టీడీపీ, బీజేపీ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశాయి. అయినా అప్పుడు ఆత్మహత్య చేసుకున్న 435 రైతుల కుటుంబాలకు పరిహారం ఇవ్వలేదు. అదే జగన్‌గారు ఆనాడు వేల మందితో రైతు భరోసాయాత్ర చేస్తే, అప్పుడు దిగి వచ్చిన ప్రభుత్వం హడావిడిగా చెక్కులు పంపిణీ చేసింది.
 అంతకు ముందు ఏళ్ల తరబడి, చనిపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోలేదు. అప్పుడు మీరూ ప్రభుత్వంలో ఉన్నారు. ఎందుకంటే ఆరోజు మీరు చంద్రబాబుకు ఓటేయమని పిలుపునిచ్చారు. ఆయన తరపున రైతుల రుణమాఫీపైనా హామీ ఇచ్చారు.

●ఇవాళ్టి పర్యటన రాజకీయం కాదా.?
 
మీరు ఇవాళ రైతుల కుటుంబాల పరామర్శకు వచ్చి, ఆర్థిక సహాయం చేస్తున్నామని చెప్పి, రాజకీయాలు మాట్లాడారు. మీరు వస్తున్నారని టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల సంగతి ఏమిటి? మీరు చెప్పేవన్నీ శ్రీరంగ నీతులు. కానీ మీరేం చేశారు?.ఇవాళ మీరు అనంతపురం కూడా ఎందుకు వెళ్లారంటే, టీడీపీకి అక్కడికి వెళ్లే ముఖం లేక, మిమ్మల్ని పంపించింది. అందుకే మీరు అవే చిలక పలుకులు మాట్లాడుతున్నారు. మీకు స్క్రిప్ట్‌ ఎవరు రాసిస్తున్నారో, మీ ఎజెండా ఎవరు ఫిక్స్‌ చేశారో? అందరికీ తెలుసు.

●అప్పుడు జాలి, దయ కలగలేదా.?
 
మీ ప్రభుత్వంలో జరిగిన ఆత్మహత్యలు మీకు గుర్తుకు రాలేదు.ఆరోజు అమరావతిలో మీరు రైతుల పెరుగన్నం తిన్నారు. వారికి అండగా ఉంటామన్నారు. ఆ పనీ చేయలేదు. అనంతపురంలో గత ప్రభుత్వ హయాంలో రైతులు పెరుగన్నంలో పురుగుల మందు కలిపి ఆత్మహత్య చేసుకుంటే మీకు జాలి, దయ కలగ లేదు. కానీ ఇవాళ మీరు రైతుల కుటుంబాకు రూ.7 లక్షల పరిహారం ఇవ్వాలని డిమాండ్‌ చేస్తున్నారు.
 
●అనంతపురంలోనే 84 కుటుంబాలను ఆదుకున్నాం:
 
గత ప్రభుత్వ హయాంలో ఆత్మహత్య చేసుకున్న రైతులకు పరిహారం ఇవ్వలేదు. కానీ జగన్‌గారు సీఎం అయ్యాక, 2019కి ముందు ఒక్క అనంతపురం జిల్లాలోనే ఆత్మహత్య చేసుకున్న 84 రైతుల కుటుంబాలకు ఆ పరిహారం అందించారు. గత ప్రభుత్వ హయాంలో మీరు రూ.5 లక్షల కూడా ఇవ్వడానికి ఇబ్బంది పడితే, ఆ పరిహారాన్ని రూ.7 లక్షలు చేస్తూ, సీఎం జగన్‌గారు చట్టం చేశారు.
 
●రైతులకు మీరేం ఒరగబెట్టారు.?
 
గత ప్రభుత్వం రూ.3 లక్షల కోట్లు అప్పులు చేసింది. కానీ రైతులకు ఏం చేసింది? పెట్రోల్, డీజిల్‌పై పన్నులు అడ్డగోలుగా పెంచి ఆదాయం పెంచుకున్నారు. కానీ రైతులకు మేలు చేసిందేమీ లేదు. పైగా రైతులకు ఉచిత విద్యుత్‌కు సంబంధించి, డిస్కమ్‌లకు రూ.27 వేల కోట్ల బకాయిలు ఎగ్గొట్టారు. కానీ మీరు ఇవాళ శ్రీరంగ నీతులు చెబుతున్నారు. నిజానికి మీరు ఏనాడూ వ్యవసాయాన్ని పండగ చేయాలని అనుకోలేదు. రైతుల బాగు కోరుకోలేదు. చంద్రబాబుగారు, మీరు వ్యవసాయం దండగ అని మాట్లాడారు. ఏనాడు రైతుల కన్నీరు తుడవాలని అనుకోలేదు.

●మనస్ఫూర్తిగా సీఎం చేస్తున్నారు..
 
కానీ మనస్ఫూర్తిగా ఆ పని నాడు దివంగత మహానేత వైయస్సార్‌ చేశారు. ఆయన ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వంగా పని చేసింది. అందుకే ఆయన కుమారుడు జగన్‌మోహన్‌రెడ్డిగారికి ప్రజలు పట్టం కట్టారు. ఆయన అధికారంలోకి రాగానే రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. వాటి ద్వారా విత్తనాలు మొదలు పంటలు అమ్ముకునే వరకు అడుగడుగునా రైతులకు అండగా నిలుస్తున్నారు. రైతులకు నాణ్యమైన విత్తనాలు, ఎరువులు, పురుగు మందుల అందేలా చూస్తున్నారు. రైతులకు పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 చొప్పున ఇస్తున్నారు. ఇంకా రైతు భరోసా కేంద్రాలకు అనుగుణంగా ప్రత్యేకంగా వ్యవసాయ ల్యాబ్‌లు కూడా ఏర్పాటు చేశారు. వ్యవసాయాన్ని పండగ చేయడానికి అన్ని పనులు చేస్తున్నారు. మరోవైపు వరసగా మూడేళ్ల నుంచి వర్షాలూ బాగా కురుస్తున్నాయి. అంతా సుబిక్షంగా ఉంది.

●మీరు రైతులను మోసం చేశారు:
 
కానీ పవన్‌కళ్యాణ్‌గారు ఇక్కడికి వచ్చి, చిలక పలుకులు పలుకుతున్నారు. అనంతపురం జిల్లాను ఇజ్రాయిల్‌తో పోలుస్తున్నారు. ఏమీ చేయలేకపోతున్నారని అడుగుతున్నారు. మరి మీరు ఎందుకు చేయలేదు. మీరు సమర్థించిన ప్రభుత్వం 2014 నుంచి 2019 వరకు అధికారంలో ఉంది. కానీ ఏం పీకారు?. మీ సాక్షిగా ప్రజలను ఓట్లేయమన్నారు. వారు వేశారు. ఆ తర్వాత మీరంతా కలిసి రైతులను మోసం చేశారు.

●రైతులకు ఇవన్నీ చేస్తున్నాం:
 
అదే మా ప్రభుత్వం వచ్చాక అనంతపురం జిల్లాలో ప్రతి చెరువుకు నీరిచ్చాం. పేరూరు డ్యామ్‌కు నీరిచ్చాం. 40 వేల రైతులకు ఉచితంగా బోర్లు వేస్తున్నాం. సున్నా వడ్డీ పంట రుణాలు ఇస్తున్నాం. ఇన్‌పుట్‌ సబ్సిడీలు సకాలంలో ఇస్తున్నాం. ఏ సీజన్‌లో పంట నష్టం జరిగితే, అదే సీజన్‌లో రైతులకు పెట్టుబడి రాయితీ (ఇన్‌పుట్‌ సబ్సిడీ) ఇస్తున్నాం. ఆ విధంగా ప్రతి అడుగులో రైతులకు అండగా నిలబడుతున్నాం.

●మీ అవసరం లేదు:
 
కాబట్టి మీ అవసరం రైతులకు లేదు. ఈ రాష్ట్రానికి లేదు. మీరు అనంతపురం జిల్లాకు రావాల్సిన పని లేదు.
 మీరు రూ.100 కోట్ల రాబడి ఉన్న వ్యక్తి. మీరు ఏడాదికి ఒకసారి వచ్చి, చనిపోయిన రైతుల కుటుంబాలకు రూ.50 వేలు లేక లక్ష రూపాయల చొప్పునో ఏడాదికి కోటి రూపాయలో, రెండు కోట్ల రూపాయలో పంచి పెడతాము. నేను కానిస్టేబుల్‌ కుమారుడిని. స్వయంగా వ్యవసాయం చేశాను. కాబట్టి ప్రజల్లో ఒకడ్ని అని చెప్పుకునే ప్రయత్నం చేయకండి. ఎందుకంటే మీరు వందల కోట్ల ఆదాయం ఉన్న వారు. పన్నులు చెల్లించేంత ఆదాయం ఉండకూడదని అనుకునే వారు. మీరు ఆన్‌లైన్‌ టికెటింగ్, ఆన్‌లైన్‌ పేమెంట్‌ విధానాన్ని వ్యతిరేకించిన వారు. ఎందుకంటే మీకు ఎంత ఆదాయం వస్తుందనేది ప్రజలకు తెలియకుండా ఉండదనుకునే వారు.

●బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ టీడీపీ:
 
కాబట్టి మిమ్మల్ని పేటీఎం అనకూడదు. మిమ్మల్ని దత్తపుత్రుడు అనకూడదు. మిమ్మల్ని బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ తెలుగుదేశం పార్టీ. బ్రాండ్‌ అంబాసిడర్‌ ఆఫ్‌ చంద్రబాబునాయుడు అని అనొచ్చు. మీరు ఎప్పటికైనా చంద్రబాబుకు దత్తపుత్రుడే. ఒకవేళ మీకు నిజంగా ఈ విమర్శలు ఎదుర్కోవడం ఇష్టం లేకపోతే.. నన్ను ముఖ్యమంత్రిని చేయండి అని మీరు ఎక్కడికి పోయినా చెప్పండి. మీరు నిజంగా టీడీపీకి సంబంధించిన వారు కాకపోతే, బీజేపీతో కలిసి ఉంటే, ఇద్దరూ కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని చెప్పండి. ఎందుకంటే బీజేపీ కూడా మిమ్మల్నే సీఎం అభ్యర్థిగా చెబుతోంది. కానీ మీరు మాత్రం కాబోయే సీఎంను అని చెప్పుకోవడం లేదు. ఎందుకంటే మీరు అమ్ముడుపోయారు. అందుకే చంద్రబాబు తరపున వకాల్తా పుచ్చుకుని మాట్లాడుతున్నారు. 

●ఆ ప్రయత్నాలు చేయొద్దు..!
 
కాబట్టి మీతో చెప్పించుకోవాల్సిన అవసరం మా ప్రభుత్వానికి లేదు. ఆత్మహత్య చేసుకున్న రైతుల కుటుంబాలకు ఇప్పటికే రూ.7 లక్షల చొప్పున పరిహారం అందజేశాం. అందుకే అనంతపురం జిల్లాకు వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం చేయొద్దు.
 అదే విధంగా మిమ్మల్ని నమ్ముకుని, తమ ఇంట్లో దాచుకున్న డబ్బు ఖర్చు చేసి మీ సినిమాలు చూస్తున్న యువతను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేయొద్దు. అలాగే మిమ్మల్ని నమ్ముకుని మీరు ఎక్కడికి వెళ్లినా తరలి వస్తున్న అభిమానుల భవిష్యత్తుతో ఆడుకోవద్దు. వారి భవిష్యత్తును ఫణంగా పెట్టి, చంద్రబాబును, ఆయన కుమారుడిని గద్దెనెక్కించే ప్రయత్నం చేయొద్దని మీకు సలహా ఇస్తున్నాను.

●మీడియా ప్రశ్నలకు సమాధానంగా.!

అవేవీ మాట్లాడరు: పవన్‌కళ్యాణ్‌ మాట్లాడుతున్న ప్రతి మాట తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌ నుంచి వచ్చిన స్క్రిప్ట్‌. అదే మాట్లాడుతున్నాడు. 21 కేసుల్లో స్టే తెచ్చుకున్న చంద్రబాబు గురించి మాట్లాడరు. బహిరంగంగా ఓటుకు కోట్లు కేసులో దొరికిపోయిన చంద్రబాబు గురించి మాట్లాడారు. ఆయన అనుభవజ్ఞులు అంటారు. ఆయన అనుభవమంతా రేవంత్‌రెడ్డిని పోలీసులు అరెస్టు చేసినప్పుడే తెలిసింది. అవేవీ మాట్లాడరు.
 టీడీపీ నేతలు ఎవరైతే బ్యాంకులకు వేల కోట్లు ఎగ్గొట్టి, స్కామ్‌లు చేసి, ప్రాజెక్టుల్లో దోచుకున్నారని విమర్శలు ఉన్నాయో.. వారంతా బీజేపీలోకి వెళ్తే ఆ పార్టీని విమర్శించారు. పైగా బీజేపీ ఇచ్చే రోడ్‌ మ్యాప్‌లో నడుస్తానంటాడు. కాబట్టి పవన్‌కళ్యాణ్‌ విమర్శలను పట్టించుకోవాలని మేము భావించడం లేదు.

●ఎప్పటికప్పుడు ఆదుకుంటున్నాం..!
 
మీరు గమనిస్తే, రైతుల ఆత్మహత్యలు జరిగితే, రైతు భరోసా కేంద్రాల నుంచి ఎప్పటికప్పుడు వివరాలు సేకరిస్తున్నాం. తహసీల్దార్, పోలీసుల ద్వారా కూడా ఆ వివరాలు సేకరిస్తున్నాం. వెంటనే వాటిని కలెక్టర్ల ద్వారా ప్రభుత్వానికి పంపడం, వాటిని నిర్ధారించుకుని ప్రతి నెలా చెక్కుల ద్వారా పరిహారం అందజేస్తున్నాం. అదే విధంగా మన్నీలలో కూడా ఇప్పటికే ఆ రైతుల కుటుంబాలకు డబ్బులు ఇచ్చాం. వారి ఖాతాల్లో నగదు కూడా జమ అయింది. అదే విధంగా విద్యుత్‌ షాక్‌తో మరణించినా, వారికీ పరిహారం ఇచ్చాం. బీమా సొమ్ము కూడా అందేలా చూశాం. గతంలో మాదిరిగా జన్మభూమి కమిటీలు లేవు. ప్రతి ఒక్కటి సచివాలయం ద్వారా జరుగుతోంది. ఎక్కడా అవినీతి, వివక్షకు తావు లేకుండా ఆన్‌లైన్‌ విధానంలో అన్ని పనులు జరుగుతున్నాయి.. అని ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డి గుర్తు చేశారు..

#YSJaganMarkGovernance 
#ThopudurthiPrakashReddy 
#RapthaduMLA #TeamTPR





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts