ప్రభుత్వం జీవో విడుదల చేసింది

BPKNEWS

ప్రభుత్వం విడుదల చేసిన జీవో

ఏలూరు అర్బన్ పరిధిలో కి రెండు రెవెన్యూ విలేజ్ లు
ఫలించిన ఎమ్మెల్యే గ్రంధి కృషి


భీమవరం

భీమవరం మండలం లోని లో సరి- గూ ట్ల పాడు, అనాకోడేరు రెవెన్యూ విలేజ్ లకు సంబంధించి దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సోమవారం పరిష్కరించారు.

ఇప్పటివరకూ ఈ రెండు రెవిన్యూ విలేజ్ ల కు సంబంధించి పది గ్రామాలు ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలో లేకపోవడంతో ఈ గ్రామాల ప్రజలు అనేక సమస్యలు,

ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఈ పది గ్రామాలను( రెండు రెవెన్యూ విలేజ్ లు) ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలోకి తీసుకురావాలని ఎమ్మెల్యే గ్రంధి చేస్తున్న కృషి సోమవారం ఫలించింది. 

ఈ రెండు రెవిన్యూ విలేజ్ లను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలోకి తీసుకువస్తూ ప్రభుత్వం సోమవారం రాత్రి జీవో విడుదల చేసింది. 

ఇందుకు సంబంధించి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ సోమవారం ఉదయం ఏలూరులో జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ని కలిసి వినతి పత్రం ఇవ్వడం తో పాటు విజయవాడ వెళ్లి రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ కలిసి ఈ రెండు రెవెన్యూ విలేజీ లను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి తీసుకువచ్చి ఆ 10 గ్రామాల ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు. 

కాగా ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విన్నపాన్ని పరిగణలోకి తీసుకొని సోమవారం రాత్రి ప్రభుత్వం జీవో విడుదల చేసింది. 

ఈ సందర్భంగా విజయవాడ నుండి సోమవారం రాత్రి ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ ఫోన్లో భీమవరం విలేకరులతో మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కరించడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి రేయింబవళ్ళూ కృషి చేస్తున్నారని అన్నారు. 

 భీమవరం మండలం లోని లో సరి -గూ ట్ల పాడు, అ నా కోడేరు రెండు రెవెన్యూ విలేజ్ లకు సంబంధించి అక్కడి ప్రజలు పడుతున్న ఇబ్బందులను ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి, మున్సిపల్ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణకు, జిల్లా కలెక్టర్ కు వివరించడం జరిగిందన్నారు.

ప్రభుత్వం వెంటనే ఈ సమస్య ను పరిష్కరిస్తూ ఈ రెండు రెవెన్యూ డివిజన్ లను ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అధారిటీ పరిధిలోకి తీసుకురావడం పట్ల ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ,మంత్రి బొత్స సత్యనారాయణ కి, జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ కు ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను అని అన్నారు.





Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts