సెంట్రల్‌లో 1,008 మందికి చేదోడు, ఎమ్మెల్యే మల్లాది విష్ణు

BPKNEWS

సెంట్రల్ లో 1,008 మందికి చేదోడు: ఎమ్మెల్యే మల్లాది విష్ణు


సంక్షోభంలోనూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ పథకాలు నిర్విరామంగా అమలు చేస్తోందని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. 

ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ‘జగనన్న చేదోడు’ కార్యక్రమానికి గతంలోనే శ్రీకారం చుట్టారన్నారు. 

షాపులున్న రజకులు, నాయీ బ్రాహ్మణులు, దర్జీ అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు ప్రతిఒక్కరికీ ఏటా రూ.10 వేల చొప్పున ఆర్థికసాయాన్ని నేరుగా వాళ్ల బ్యాంక్‌ అకౌంట్లలోనే జమ చేస్తున్నామన్నారు. 

లంచాలు, సిఫార్సులకు తావులేకుండా అత్యంత పారదర్శకంగా లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు వెల్లడించారు.
గత ప్రభుత్వంలాగా తమ ప్రభుత్వం అర్హులైన వారిని తగ్గించడం లేదని స్పష్టం చేశారు. 

రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ద్వారా 2.85 లక్షల మంది రజక, నాయీ బ్రాహ్మణ, దర్జీలకు రూ.285 కోట్ల ఆర్థిక సాయం అందుతుండగా. 

సెంట్రల్ నియోజకవర్గంలో 1,008 మందికి రూ. 1 కోటి 80 వేల రూపాయలు లబ్ధిదారుల ఖాతాలలో మంగళవారం జమ చేయనున్నట్లు వెల్లడించారు. 

బీసీలకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు అన్నారు. 

బీసీలకు రాజ్యాధికారం కల్పించాలని 56 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి వారిని చైతన్యం దిశగా నడిపిస్తున్నారన్నారు. 

నామినేటెడ్‌ పోస్టుల్లో, కాంట్రాక్టు పనుల్లో 50 శాతం బీసీలకు కేటాయిస్తున్నార‌న్నారు. 

బీసీల కోసం మ‌హానేత వైఎస్సార్ రెండడుగులు ముందుకు వేస్తే జగనన్న పదడుగులు వేస్తున్నారని పేర్కొన్నారు. 

బీసీలను బ్యాక్ వర్డ్ క్లాస్‌ గా చూసే రోజుల నుంచి బ్యాక్ బోన్ క్లాస్‌ గా మార్చివేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందని ఈ సందర్భంగా మల్లాది విష్ణు మరోసారి స్పష్టం చేశారు.









Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts