ముఖ్యమంత్రి జగన్ గారికి కృతజ్ఞతలు.
- ప్రజల ఆశలు నెరవేర్చారు.
- జిల్లా కేంద్రంగా భీమవరం.
ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు భీమవరం పట్టణాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించి ప్రజల ఆశలను నెరవేర్చారని, నరసాపురం పార్లమెంట్ ప్రజల తరఫున ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
భీమవరం జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసే నిమిత్తం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకున్నారని, అన్ని విధాలుగా కూడా భీమవరం పట్టణం జిల్లా కేంద్రానికి సముచిత స్థానం కలిగి ఉందని అన్నారు.
ప్రస్తుత జిల్లా లో ఏలూరు తర్వాత భీమవరం పట్టణానికి అంతటి ప్రాధాన్యత ఉందని, విద్య, వైద్య వ్యాపార రంగాలలో భీమవరం పట్టణం ముందుకు దూసుకెళ్తుంది అని అన్నారు.
విద్యాపరంగా డి ఏ న్ ఆర్ కాలేజీ, ఎస్ ఆర్ కె ఆర్ ఇంజనీరింగ్ కాలేజీ, కేజీ ఆర్ ఎల్ కాలేజీ, విష్ణు ఇంజనీరింగ్ కాలేజీ, విష్ణు డెంటల్ కాలేజీ, విష్ణు మహిళా కాలేజీ లాంటి అనేక ప్రముఖ విద్యా సంస్థలు ఉన్నాయని అన్నారు.
వైద్యపరంగా చూస్తే పట్టణంలో అత్యాధునిక ఆస్పత్రి లు ఉన్నాయని తెలిపారు.
వ్యాపారపరంగా ఆక్వా రంగం ఎంతో అభివృద్ధి చెందిందని, విదేశీ మారక ద్రవ్యాన్ని ఆర్జించే రొయ్య, చేపల ఎగుమతుల కేంద్రంగా భీమవరం ఉందని అన్నారు.
అంతేకాకుండా అటు తూర్పుగోదావరి జిల్లాకు ఇటు కృష్ణా జిల్లాకు మధ్యస్థ పట్టణంగా భీమవరం ఉందని అన్నారు.
అదే మాదిరిగా జిల్లా కేంద్రానికి అవసరమైన అన్ని మౌలిక వసతులు కూడా పట్నంలో ఉన్నాయని అన్నారు.
MLA Grandhi Srinivas |
మహాత్మా గాంధీ భీమవరం పట్టణాన్ని రెండవ బార్డోలి గా ప్రకటించి భీమవరం ఖ్యాతిని దేశవ్యాప్తంగా ఇనుమడింప చేశారని అన్నారు.
నరసాపురం డివిజన్ కేంద్రమైనప్పటికీ పూర్వం నుండి కూడా భీమవరం పట్టణమే అన్ని హంగులతో ఉందని అన్నారు.
రాజకీయంగా కూడా భీమవరం ప్రాంతానికి దేశ స్థాయిలోనే పేరు ఉందని అన్నారు.
పాలన సౌలభ్యం కొరకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ప్రజా సంకల్ప యాత్రలోనే జిల్లాల విభజన పై రూట్మ్యాప్ తయారు చేశారని అన్నారు.
పాలనా వికేంద్రీకరణ వల్ల ప్రజలకు మరింతగా ప్రభుత్వాన్ని దగ్గర చేయడానికి అవకాశం ఉంటుందని గుర్తించే గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ కు, వైయస్సార్ హెల్త్ క్లినిక్ ల కు, రైతు భరోసా కేంద్రాల కు శ్రీకారం చు ట్టారని అన్నారు.
రాష్ట్రంలో ప్రస్తుతం 13 జిల్లాల ఉండగా 26 జిల్లాలుగా మార్పు చేస్తూ రాష్ట్ర ప్రజలకు పాలనను మరింత దగ్గర చేసిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం.
ప్రజల సంక్షేమ కోసం ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు నిత్యం ఆలోచన చేస్తూనే ఉంటారని శాసనసభ్యులు గ్రంధి శ్రీనివాస్ గారు స్పష్టం చేశారు.