Advance arrangements for Gram Panchayat elections

గ్రామ పంచాయతీల ఎన్నికలకు ముందస్తు ఏర్పాట్లు.. ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ


వచ్చే ఏడాది ఏప్రిల్ 2కు ముగుస్తున్న సర్పంచుల గడువు

గ్రామ పంచాయతీ ఎన్నికల పదవీ కాలం వచ్చే ఏడాది ముగియనున్న నేపథ్యంలో ఎన్నికల నిర్వహణకు అవసరమైన ముందస్తు కార్యకలాపాలను నిర్వహించాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వానికి రాష్ట్ర ఎన్నికల కమిషన్ లేఖ రాసింది.

వచ్చే ఏడాది ఏప్రిల్ 2వ తేదీ నాటికి గ్రామ పంచాయితీల పదవీ కాలం ముగియనుంది.

అప్పటిలోపు ఎన్నికలను నిర్వహించాల్సి ఉంది.

అందుకోసం సర్పంచ్లు, వార్డు సభ్యుల రిజర్వేషన్లు, డీలిమిటేషన్, ఖరారు వంటి ముందస్తు ఎన్నికల కార్యకలాపాలను పూర్తి చేయాల్సి ఉంది.

ప్రీ ఎలక్షన్ షెడ్యూల్..

  • డీలిమిటేషన్, రిజర్వేషన్లు ఖరారు ప్రక్రియను అక్టోబరు 15లోగా పూర్తి చేసుకోవాలి.
  • అక్టోబరు 16 నుంచి నవంబరు 15లోపు వార్డుల వారీ ఓటర్ల జాబితాను సిద్ధం చేయాలి.
  • నవంబరు 1 నుంచి 15 దాకా రిటర్నింగ్ అధికారులను నియమించుకోవాలి.
  • నవంబరు 16 నుంచి పోలింగ్ స్టేషన్లు ఏర్పాటు చేసుకుని తుది జాబితా సిద్ధం చేయాలి.
  • నవంబరు 30 లోగా ఎన్నికల కసరత్తు పూర్తి చేయాలి.
  • రిజర్వేషన్ల ప్రక్రియను డిసెంబరు 15 లోగా పూర్తి కావాలి.
  • డిసెంబరు చివరి వారంలో రాజకీయ పార్టీలతోను, సీనియర్ అధికారులతోను సమావేశం నిర్వహించాలి.
  • 2026 జనవరి నుంచి గ్రామ పంచాయతీలకు, జూలై నుంచి ఎంపీటీసీ/జడ్పీటీసీలకు ఎన్నికల ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుందని నీలం సాహ్నీ తెలిపారు.

Post a Comment

Previous Post Next Post