26న ప్రభుత్వ డిగ్రీ కాలేజీలో జాబ్మేళా
కైకలూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ, సీడాప్
జిల్లా ఉపాధి కార్యాలయం సంయుక్త అధ్వర్యంలో
ఆటపాక వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఈ నెల 26న జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీలత ఆదివారం చెప్పారు.
జాబ్ మేళాలో ఫోర్ట్ మేనేజ్మెంట్ సర్వీసెస్,
కైకలూరు నేషనల్ స్కూల్,
నవతా రోడ్డు ట్రాన్స్ పోర్ట్ కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారన్నారు.
సుమారు 160 మంది నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారన్నారు.
టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, పీజీ వంటి విద్యార్హతలు కలిగి 18-35 సంవత్సరాల వయస్సు కలిగిన యువత అర్హులన్నారు.
మరిన్ని వివరాలకు 9701357315, 6281119575 నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ నంబరు 9988853335లో సంప్రదించవచ్చన్నారు.
Tags
Job fair at Government Degree College
Job fair at Government Degree College Kaikalur on 26th
Kaikalur