యువత క్రీడలలో రాణించాలి: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
Politician
నేటి యువతలో క్రీడా స్ఫూర్తిని పెంపొందించటమే రాష్ట్ర ప్రభుత్వ ధ్వేయమని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
ఈనెల 25న విజయవాడ నగరంలో జరిగిన ఇంటర్ డిస్ట్రిక్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ – 2022 మరియు 28, 29 తేదీలలో కడపలో జరిగిన రాష్ట్రస్థాయి పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన పలువురు అథ్లెట్స్ సోమవారం ఎమ్మెల్యే మల్లాది విష్ణుని ఆంధ్రప్రభ కాలనీలోని ఆయన కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా క్రీడాకారులను ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్రీడాకారులకు ఆటే జీవితమని ప్రతిభ కలిగిన ప్రతి క్రీడాకారుడిని ఈ ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని తెలిపారు.
రాష్ట్రంలో క్రీడారంగానికి పూర్వ వైభవం తీసుకొచ్చేందుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నట్లు వెల్లడించారు.
ఇందులో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలల్లో తప్పనిసరిగా మైదానాలు ఉండేలా చూడటంతో పాటుగా క్రీడల్లో రాణించేలా తర్ఫీదునివ్వాలని సీఎం సంకల్పించారని తెలిపారు.
ఈ అవకాశాలను అందిపుచ్చుకుని నగర యువత అంతర్జాతీయ పోటీలలో రాణించి అద్భుతాలు సృష్టించాలని ఆకాంక్షించారు.
క్రీడాకారులకు కావలసిన సదుపాయాలన్నింటినీ రాష్ట్ర ప్రభుత్వం, నగర పాలక సంస్థ సహకారంతో సమకూర్చేందుకు తాము సిద్దంగా ఉన్నామన్నారు.
ఎమ్మెల్యేను కలిసిన వారిలో రాష్ట్రస్థాయి పోటీలలో 5 కి.మీ. రన్నింగ్ లో మూడో స్థానంలో నిలిచిన డి.వి.ఎస్.డి.భవానీ(21)., ఇంటర్ డిస్ట్రిక్ సీనియర్ అథ్లెటిక్స్ ఛాంపియన్ షిప్ – 2022 లో 1,500 మీటర్ రన్నింగ్ లో తొలి స్థానంలో నిలిచిన షేక్ అబ్దుల్ మౌలాలి (25)., 400 మీటర్ రన్నింగ్ లో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచిన ఎల్.మనోజ్ కుమార్(21), మూడో స్థానంలో నిలిచిన వి.స్టీఫెన్ (20), కోచ్ విజయ్ తదితరులు ఉన్నారు.
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
all the best guys
ReplyDelete