గ్రీన్ సిటీగా కొండ పావులూరు జగనన్న కాలనీ : ఎమ్మెల్యే మల్లాది విష్ణు

BPKNEWS

గ్రీన్ సిటీగా కొండ పావులూరు జగనన్న కాలనీ: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

ఎమ్మెల్యే చేతుల మీదుగా పేదల ఇళ్ల నిర్మాణాలకు శంకుస్థాపన

పేదల సొంతింటి కల సాకారమే లక్ష్యంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నేతృత్వంలో రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు.
కొండపావులూరు లేఅవుట్ బ్లాక్ – 1 లో 40 ఇళ్లకు డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డితో కలిసి శుక్రవారం ఆయన శంకుస్థాపన చేశారు.

ఈ సందర్భంగా మల్లాది విష్ణు మాట్లాడుతూ.. నిరుపేదల సొంతింటి కల సాకారం కోసం కాలనీల పేరుతో ఏకంగా మినీ సిటీలనే నిర్మిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కృషిని కొనియాడారు.
దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయని విధంగా 31 లక్షల మంది పేద కుటుంబాలకు సొంతింటి స్థలం మంజూరు చేసిన ఏకైక ప్రభుత్వం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం అని చెప్పుకొచ్చారు.
దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి గారి హయాంలో విజయవాడ నగరంలో 28వేల ఇళ్లను మంజూరు చేయగా, సీఎం జగన్మోహన్ రెడ్డి మరో నాలుగు అడుగులు ముందుకేసి లక్ష ఇళ్లను పేదలకు మంజూరు చేశారని చెప్పుకొచ్చారు.
ఒక్క విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోనే 30వేల మంది నిరుపేద కుటుంబాలకు ఇళ్ల పట్టాలు కేటాయించామన్నారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం అక్షరాలా రూ. 270 కోట్లను వెచ్చించడం జరిగిందన్నారు.
తెలుగుదేశం హయాంలో ఏ ఒక్క నియోజకవర్గంలోనూ పేదల కోసం ఇంత పెద్దమొత్తంలో నిధులను కేటాయించలేదని గుర్తుచేశారు.
పైగా తెలుగుదేశం హయాంలో విజయవాడ నగరంలో 10వేల ఇళ్లను తాము కట్టలేమని కౌన్సిల్ లో తీర్మానించి కేంద్ర ప్రభుత్వానికి పంపడం, టీడీపీ నాయకుల చేతగానితనానికి నిదర్శనమన్నారు.
కానీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పేదలకు ఉచితంగా స్థలం ఇవ్వడమే కాకుండా రూ.1 లక్షా 80 వేల ఆర్థిక సాయాన్ని అందిస్తోందన్నారు.
అంతేకాకుండా లబ్ధిదారుని అవసరాన్ని బట్టి మరో రూ. 50 వేల నుంచి లక్ష రూపాయల వరకు బ్యాంకర్ల నుంచి రుణాన్ని సమకూరుస్తుందని వెల్లడించారు.
ఇటువంటి బృహత్తర కార్యక్రమ ఆలస్యానికి కోర్టులలో తెలుగుదేశం నాయకులు వేసిన కేసులే కారణమని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
లేకుంటే తొలి ఏడాదిలోనే పేదలందరూ గృహ ప్రవేశాలు చేసుండేవారని వెల్లడించారు.
6,800 ఇళ్లతో రూపుదిద్దుకుంటున్న కొండపావులూరు జగనన్న కాలనీని గ్రీన్ సిటీగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని స్పష్టం చేశారు.
ఓవైపు గృహ నిర్మాణాలు జరుగుతుండగానే మరోవైపు యుద్ధ ప్రాతిపదికన మౌలిక సదుపాయాల కల్పనకు చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు.
కార్యక్రమంలో డీఈ(హౌసింగ్) రవికాంత్, ఏఈ(హౌసింగ్) చలపతిరావు, వైఎస్సార్ సీపీ కార్పొరేటర్లు అలంపూరు విజయలక్ష్మి, ఇసరపు దేవి, జానారెడ్డి, వీఎంసీ అధికారులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు.




Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications





donation

Comments

Popular Posts