వివిధ రంగాలలో సేవలందిస్తున్న సేవకులు, కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు
అప్స కైకలూరు డివిజన్ ఆధ్వర్యంలో కలిదిండి లోని కలిదిండి పబ్లిక్ ఉన్నతపాఠశాల నందు
శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది వేడుకలను శనివారం సాయంత్రం ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా వివిధ రంగాలలో సేవలందిస్తున్న సేవకులు, కళాకారులకు సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు.
విద్యా రంగంలో ఎనలేని సేవలు అందిస్తున్న అప్సర జిల్లా అధ్యక్షుడు గొల్లపూడి మోహన్ రావు దంపతులకు తొలుత సన్మానం నిర్వహించారు.
కూచిపూడి నృత్య కళ లో దేశవిదేశాలలో ఎన్నో కార్యక్రమాలు నిర్వహించి వెయ్యి మందికి పైగా శిక్షణనిచ్చి 28 బిరుదులను సొంతం చేసుకున్నా పసుమర్తి శ్రీ వల్లి గారికి,
చిన్న వయసులోనే సేవా రంగంలో విశేష సేవలందిస్తూ ప్రభుత్వ పాఠశాలలను గ్రామాలను దత్తత తీసుకొని ఎన్నో సదుపాయాలు మరెన్నో సేవలు అందిస్తూ అమరావతి బ్రాండ్ అంబాసిడర్ గా వివేకానంద ఇండియన్ ఐకాన్ గా గుర్తింపు పొందిన అంబుల వైష్ణవి గారికి,
రంగస్థల నటుడిగా తెలుగు భాష ప్రచారకర్తగా విశేష సేవలందిస్తున్న కోరుకొల్లు కు చెందిన చెన్నంశెట్టి వీర వెంకయ్య గారు,
సాహిత్యరంగంలో ప్రజా హితమైన కవితలు కథలు రాస్తూ తెలుగు భాషాభివృద్ధికి కృషి చేస్తున్న కలిదిండి మండలం సాహితి మిత్రుల సంఘం అధ్యక్షులు ఎల్ ఆర్ పోలిశెట్టి గారిని ఘనంగా సన్మానించారు.
వీరితో పాటు అప్స జిల్లా గౌరవ అధ్యక్షులు చెన్నం శెట్టి కృష్ణ గారు,
జిల్లా కోశాధికారి అర్జా ప్రసాద్ గారికి కైకలూరు డివిజన్ అధ్యక్షులు ఏవి కోటేశ్వరరావు గారు, ప్రధాన కార్యదర్శి పోలిశెట్టి కనక దుర్గ భవాని, కోశాధికారి పిటీవీ కుటుంబరావు, పడమటి పాలెం సర్పంచి సాన సరస్వతి, జో బిని గారికి సన్మానం నిర్వహించారు.
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
Comments
Post a Comment