మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్ (ఎండీయూ) వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
ప్రజా పంపిణీ వ్యవస్థలో రేషన్ వాహనాలు ఒక నూతన విప్లవం
మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్(MDU) వార్షికోత్సవ కార్యక్రమంలో ఎమ్మెల్యే మల్లాది విష్ణు
రేషన్ వాహనాల ద్వారా ప్రజా పంపిణీ వ్యవస్థలో సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విప్లవాత్మక మార్పు తీసుకొచ్చారని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం రేషన్ వాహనాలను(మొబైల్ డిస్ట్రిబ్యూషన్ యూనిట్స్) ప్రారంభించి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఆంధ్రప్రభ కాలనీలోని జనహిత సదనంలో వార్షికోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
సంక్షేమ పథకాలను గడపగడపకు చేరవేర్చడంలో భాగంగా....
విజయవాడలోని బెంజ్ సర్కిల్ వద్దనే 9,260 వాహనాలను రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ముఖ్యమంత్రివర్యులు జెండా ఊపి ప్రారంభించారని ఈ సందర్భంగా గుర్తుచేశారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా సబ్సిడీపై అందించిన ఈ వాహనాల ద్వారా ఎంతో మంది యువతకు ఉపాధి లభించిందన్నారు.
గతంలో రేషన్ కోసం కార్డుదారులు గంటల తరబడి నిరీక్షించే పరిస్థితి ఉండేదన్నారు.
రేషన్ సరుకుల కోసం లబ్ధిదారులు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వినూత్న రీతిలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు అందిస్తోన్నట్లు తెలిపారు.
ఇందులో భాగంగా గతేడాది ఇదే రోజున రేషన్ సరుకులను చేరవేసే వాహనాలను(MDU) ప్రారంభించి విజయవంతమయ్యారని మల్లాది విష్ణు పేర్కొన్నారు.
ఇందుకోసం రాష్ట్ర ప్రభుత్వం ఏటా రూ. 830 కోట్లు అదనంగా వెచ్చిస్తున్నట్లు తెలిపారు.
అంతేకాకుండా రేషన్ సరుకులు సకాలంలో ఇళ్లకు చేరుతున్నాయా లేదా అనేది తెలుసుకునేందుకు అన్ని మొబైల్ వాహనాలకు జీపీఎస్ అమర్చడం జరిగిందన్నారు.
కార్డుదారులు మొబైల్ యాప్ ద్వారా పంపిణీ వివరాలను రియల్ టైంలో కూడా తెలుసుకోవచ్చన్నారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా ప్రజల గుమ్మం వద్దకే పాలనను అందిస్తోన్న ఈ ప్రభుత్వాన్ని ప్రజలందరూ ఆశీర్వదించాలని కోరారు.
అనంతరం కేక్ కట్ చేసి వాహనదారులకు శుభాకాంక్షలు తెలిపారు.
కార్యక్రమంలో నాళం బాబు, షేక్ సుభాని, రేపాల కిరణ్ కుమార్, కరీముల్లా, పి.విల్సన్, శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు.
****************************************************
Follow Us on
Website : https://www.bpknews.online
Youtube : Facebook : Twitter : Pinterest : BPKNEWS
Forms : https://bit.ly/bpknewsforms
Blogger : bpknewsofficial
****************************************************
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
Comments
Post a Comment