అమరావతి: 2027 గోదావరి పుష్కరాలకు ముహూర్తం ఖరారు – కేంద్రం రూ.100 కోట్ల కేటాయింపు
అమరావతి: ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్న గోదావరి పుష్కరాలు 2027 తేదీలు అధికారికంగా ఖరారయ్యాయి. ప్రభుత్వం ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం, 2027 జూలై 23 నుంచి ఆగస్టు 3 వరకు పుష్కర మహోత్సవాలు జరగనున్నాయి. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఈ పవిత్ర ఘట్టానికి ఇప్పటికే భారీ ఏర్పాట్ల బాట పట్టింది.
కేంద్రం ముందస్తుగానే నిధుల కేటాయింపు
గోదావరి పుష్కరాల కోసం కేంద్ర ప్రభుత్వం ముందస్తుగానే పెద్ద మొత్తంలో నిధులను కేటాయించింది. ఇప్పటికే పుష్కరాల నిర్వహణ, ఘాట్‌ల అభివృద్ధి, రోడ్లు, తాగునీరు, పారిశుధ్య సదుపాయాలు, భద్రత కోసం రూ.100 కోట్లను ఆమోదించింది.
ఇది రాష్ట్ర ప్రభుత్వం పుష్కరాల ఏర్పాట్లను వేగవంతం చేయడానికి ఎంతో దోహదం చేస్తుందని అధికారులు పేర్కొంటున్నారు.
పుష్కరాలు ఎప్పుడు? — ముఖ్య తేదీలు
- ప్రారంభం: 23 జూలై 2027
- ముగింపు: 3 ఆగస్టు 2027
- కాలం: 12 రోజులు
పుష్కరాల ప్రాముఖ్యత
గోదావరి నదీ పుష్కరాలు హిందూ సంప్రదాయంలో అత్యంత పవిత్రమైన పర్వదినాల్లో ఒకటి. కోట్లాది మంది భక్తులు నదిలో స్నానం చేసి పుణ్యం ఆర్జించేందుకు దేశం నలుమూలల నుంచి వస్తారు. రాష్ట్రంలో గోదావరి తీరం అంతా పండుగ వాతావరణం నెలకొంటుంది.
English Version: Godavari Pushkaralu 2027 Dates Announced – Centre Allocates ₹100 Crore
Amaravati: The dates for the much-awaited Godavari Pushkaralu 2027 have been officially announced. The sacred event will be held from July 23, 2027 to August 3, 2027. Preparations for this spiritual festival have already begun at a brisk pace.
Central Government Allocates ₹100 Crore
The Government of India has sanctioned ₹100 crore in advance to support the arrangements, development of ghats, sanitation facilities, drinking water, transportation, and security measures during the Pushkaralu.
Key Dates
- Start Date: July 23, 2027
- End Date: August 3, 2027
- Duration: 12 Days
The Godavari Pushkaralu is one of the most spiritually significant events in India, attracting millions of devotees seeking holy river blessings.
