అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవంలో ఎమ్మెల్యే అంజిబాబు
స్థలం: భీమవరం మెంటేవారి తోట | తేదీ: నవంబర్ 13, 2025
భీమవరం మెంటేవారి తోటలో గ్రంధి శ్యామ్ శివరాజ్ ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించిన అయ్యప్ప స్వాముల పడిపూజ మహోత్సవాన్ని రాష్ట్ర పబ్లిక్ అకౌంట్స్ కమిటీ చైర్మన్, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప, మణికంఠ మురళీ గురుస్వాములు భక్తిశ్రద్ధలతో కార్యక్రమాన్ని నిర్వహించారు.
భక్తి పరవశ్యంలో పాల్గొన్న భక్తులు అభిషేకాలు, మంగళహారతులు నిర్వహించి, స్వామి వారికి నైవేద్యాలు సమర్పించారు. ఎమ్మెల్యే అంజిబాబు మాట్లాడుతూ, “అయ్యప్ప స్వాముల పట్ల భక్తిశ్రద్ధతో నిర్వహించే పడిపూజలు సమాజంలో ఆధ్యాత్మికతను పెంపొందిస్తాయి” అన్నారు.
ఈ వేడుకలో ఏపీఐఐసీ డైరెక్టర్ చెనమల్ల చంద్రశేఖర్, మెంటే మనోజ్, తోట సురేష్, కారుమూరి సత్యనారాయణ మూర్తి, కూటమి నాయకులు, అయ్యప్ప స్వాములు పాల్గొన్నారు.
MLA Anjibabu Participates in Ayyappa Swamy Padi Pooja Festival at Bhimavaram
The Ayyappa Swamy Padi Pooja Mahotsavam was held at Mentevari Thota in Bhimavaram under the supervision of Grandhi Shyam Shivraj. The ceremony was inaugurated by MLA Pulaparthi RamAnjaneyulu (Anjibabu), Chairman of the State Public Accounts Committee, with traditional pooja rituals.
Devotees chanted “Swamiye Saranam Ayyappa” and offered prayers, performing abhishekams, mangala harathis, and devotional songs. MLA Anjibabu expressed that conducting such devotional programs enhances spiritual harmony in society.
The event was attended by APIIC Director Chenamalla Chandrasekhar, Mente Manoj, Thota Suresh, Karumuri Satyanarayana Murthy, and several Ayyappa devotees and community leaders.
