భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన శకం: రైతే రాజుగా పాలన సాగాలి
భీమవరం, సెప్టెంబర్ 2025: భీమవరం వ్యవసాయ మార్కెట్ కమిటీ (AMC) నూతన పాలకవర్గం కొలువుదీరింది.
చైర్మన్‌గా శ్రీమతి కలిదిండి సుజాత రామచంద్రరాజు,
వైస్ చైర్మన్‌గా శ్రీ బండి రమేష్ కుమార్,
డైరెక్టర్‌గా శ్రీమతి కె. రమాదేవి (బీజేపీ నాయకురాలు)తో పాటు ఇతర నూతన డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు.
ఈ కార్యక్రమం పలువురు రాష్ట్ర స్థాయి ప్రముఖులు, నాయకులు, కార్యకర్తల సమక్షంలో వైభవంగా జరిగింది.
ఈ ప్రమాణ స్వీకార మహోత్సవానికి రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి శ్రీ నిమ్మల రామానాయుడు,
భీమవరం శాసనసభ్యులు మరియు రాష్ట్ర పీఏసీ చైర్మన్ శ్రీ పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు),
రాజ్యసభ సభ్యులు శ్రీ పాకా సత్యనారాయణ,
టిడిపి పొలిట్ బ్యూరో సభ్యురాలు మాజీ ఎంపీ శ్రీమతి తోట సీతారామలక్ష్మి,
ఏపీఐఐసీ (APIIC) చైర్మన్ శ్రీ మంతెన రామరాజు,
రాష్ట్ర మహిళా సహకార ఆర్థిక సంస్థ చైర్‌పర్సన్ శ్రీమతి పీతల సుజాత,
జనసేన పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ కోటికలపూడి గోవిందబాబు,
మరియు బీజేపీ జిల్లా అధ్యక్షురాలు శ్రీమతి అయినంపూడి శ్రీదేవి వంటి తదితర ప్రముఖులు హాజరై నూతన కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా, నూతనంగా ఎన్నికైన పాలకవర్గానికి హృదయపూర్వక అభినందనలు తెలిపిన బిజేపి వర్మ గారు.
రైతుల సంక్షేమమే ధ్యేయంగా, వ్యవసాయ మార్కెట్ అభివృద్ధి లక్ష్యంగా ఈ కొత్త కమిటీ అంకితభావంతో పనిచేస్తుందని దృఢంగా విశ్వసిస్తున్నాము.
గత కొన్నేళ్లుగా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు అన్నీ ఇన్నీ కావు.
పంటకు గిట్టుబాటు ధర లభించక, మార్కెటింగ్ సదుపాయాలు సరిగ్గా లేక ఎంతోమంది రైతన్నలు నష్టపోయారు.
ఈ నేపథ్యంలో, నూతన కమిటీపై రైతాంగం పెద్ద ఆశలే పెట్టుకుంది.
వారి ఆశలను వమ్ము చేయకుండా, రైతన్నల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురావడానికి, వారి పంటలకు గిట్టుబాటు ధర కల్పించడానికి మరియు మార్కెట్ సదుపాయాలను మరింత మెరుగుపరచడానికి ఈ బృందం నిస్వార్థంగా కృషి చేస్తుందని ఆశిస్తున్నాము.
నూతన చైర్మన్ శ్రీమతి కలిదిండి సుజాత రామచంద్రరాజు నాయకత్వంలో, వైస్ చైర్మన్ శ్రీ బండి రమేష్ కుమార్ మరియు ఇతర డైరెక్టర్ల సహకారంతో భీమవరం ఏఎంసీ రైతుల పాలిట కల్పతరువుగా మారుతుందని ఆకాంక్షిద్దాం.
ఈ కొత్త ప్రయాణంలో వారికి అంతా మంచే జరగాలని కోరుకుంటూ, వారి పదవీకాలం విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాము.
– బిపికె న్యూస్ స్పోర్ట్స్ డెస్క్