ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2022
ప్రపంచ పర్యావరణ దినోత్సవం
పర్యావరణం దేవుడు ఇచ్చిన ఒక అందమైన సృష్టి. పర్యావరనం మనిషి ఆహ్లాదంగా మరియు ఆనందంగా జీవించడానికి ఎంతో దోహదపడుతుంది. ఈ గాలి, నేల, నీరు, వెలుతురు, అడవులు మొదలగునవి మనిషి జీవితాన్ని సక్రమమైన మార్గంలో నడిచేలా చేస్తాయి. విశ్వం లో భూమి మాత్రమే మానవ జీవన మనుగడకు కావలసిన వాతావరణం కలిగి ఉన్నది. చక్కని పర్యావరణం లేకుండా మనవ జీవితం ఎలా ఉంటుందొ మనం అంచనా వేయలేము కాబట్టి పర్యావరనాన్ని కాపాడుకోవడం ఎంతో అవసరం. మనం పర్యావరనాన్ని శుభ్రంగా, సురక్షితంగా ఉంచాలి. పర్యావరణాన్ని కాపాడవలసిన భాధ్యత భూమి మీద నివసిస్తున్న ప్రతీ ఒక్కరి మీద ఉంది. ప్రతీ ఒక్కరు ముందుకు వచ్చి పర్యావరణాన్ని కాపాడేలా చర్యలు తీసుకోవాలి.
మనిషి సృస్టించిన రక రకాల సాంకేతిక పరికరాల ద్వారా వాతావరనం ప్రతీ రోజూ క్షీనిస్తూ ఉన్నది. అందువలన వాతావరణ కాలుష్యం అనేది ఈ రోజుల్లో పెద్ద సమస్యగా మారింది. అంతే కాకుండా వాతావరణ కాలుష్యం మనిషి ఆరొగ్యాన్ని కూడా దెబ్బ తీస్తుంది. రేడియో, టివి మరియు సెల్ టవర్ల నుండి విడుదలయ్యే రేడియో కిరణాలు జీవన మనుగడకు అత్యంత హానికరం. అనేక పక్షులు ప్రతి రోజూ రేడియేషన్ ద్వారా చనిపోతున్నయి. వాహనాలు, ఫ్యాక్టరీలు, అనేక పరిశ్రమల నుండి వెలువడే వ్యర్ధ పదార్ధాల ద్వారా గాలి, నేల, నీరు, కలుషితమవుతున్నాయి. ఫ్యాక్టరీలు, పరిశ్రమల నుండి విడుదల అయ్యే వ్యర్ధపదర్ధాలు నదులలో వదలడం వల్ల జలచరాలు రోజు రోజు తగ్గుతున్నాయి. ఇంకా పంట పొలాలకు కలుషిత నీరు ఇవ్వడం ద్వారా ఆహారం కలుషితం అవుతుంది. ఫెర్టిలైజర్స్ వాడడం వల్ల అవి నేలను, నీరును కలుషతం చేస్తున్నయి. వివిధ రకాల రసాయనాలు ఆహారం ద్వారా శరీరంలో పేరుకుపోతున్నాయి.
భవనాలు, రోడ్లు విస్తరించుట వల్ల వర్షపు నీరు భూమిలోనికి ఇంకటంలేదు. దాని ద్వారా భూగర్భ జలాలు తుగ్గుతున్నాయి. చెట్లను వివిధ కారణాల మూలంగా నరికివేయడం ఓజోన్ పొర క్షీనించడానికి కారణమవుతున్నది.
ఇదేవిధంగా కొనసాగితే భవిష్యత్తులో భూమి మీద మానవ మనుగడ ఎలా ఉండనున్నదో మనం అంచనా వేయలెము. అందువలన పర్యావరణాన్ని కాపాడడమే దీనికి పరిష్కారం. పర్యావరణానికి అవసరమున్నంత వరకు సద్వినియోగం చేసుకుంటూ కాపాడుకోవడమే సరైన పరిష్కారం. వ్యాపార, పారిశ్రామిక వేత్తలు స్వార్ధపరంగా ఆలోచించకుండా పర్యావరణాన్ని పరిరక్షించే కార్యక్రమాలు చేపట్టాలి. సాద్యమైనంత తక్కువ నీటిని వాడడం, ఇంకుడు గుంతలను ఏర్పాటు చేయడం, పంటలకు కృత్రిమ రసాయనాలు వినియోగించకుండా సహజ ఎరువులు వినియోగించడం, చెట్లను నాటడం మొదలగు వాటి ద్వారా పర్యావరనాన్ని రక్షించవచ్చు. పర్యావరణ పరిరక్షనే మానవ మనుగడకు మంచి మార్గం అని అందరూ తెలుసుకోవాలి.
Watch in Facebook
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
Comments
Post a Comment