మహేశ్ బాబు
మహేశ్ బాబు
ఘట్టమనేని మహేశ్ బాబు
Actors
ఘట్టమనేని మహేశ్ బాబు ఒక తెలుగు సినీ నటుడు. ఈయన ప్రఖ్యాత నటుడు సూపర్ స్టార్ కృష్ణ గారి కుమారుడు. చిన్న వయసు లోనే 8 కి పైగా చిత్రాల్లో నటించారు. హీరోగా 25కి పైగా సినిమాల్లో నటించారు. మొదటి చిత్రం రాజకుమారుడు తోనే నంది ఉత్తమ నూతన నటుడి అవార్డు అందుకున్నారు. 2003 లో వచ్చిన నిజం సినిమాకు నంది ఉత్తమ నటుడు అవార్డులు అందుకున్నారు. తర్వాత 2005 లో వచ్చిన అతడు, 2011 లో వచ్చిన దూకుడు, 2015 లో వచ్చిన శ్రీమంతుడు సినిమాలకు కూడా ఉత్తమ నటుడిగా నంది అవార్డులు గెలుచుకున్నారు. సినీ నటి నమ్రత శిరోద్కర్ను వివాహం చేసుకున్నాడు.
మహేశ్ బాబు ఆగస్టు 9, 1975న మద్రాస్ లో ఘట్టమనేని కృష్ణ మరియు ఇందిరా దేవి దంపతులకు జన్మించారు. మహేశ్ బాబు చెన్నైలోని లయోలా కళాశాల నుండి వాణిజ్యశాస్త్రంలో బ్యాచిలర్ డిగ్రీని పొందాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత, నటనలో తదుపరి శిక్షణ కోసం మూడు నాలుగు నెలల పాటు విశాఖపట్నంలో దర్శకుడు ఎల్ సత్యానందాన్ని కలుసుకున్నారు.
Mahesh Babu Foundation పేరుతో అనేక మంది చిన్నారులకు ఉచితంగా వైద్యం అందించారు.
బాలనటుడు (1989 నుండి 1990 వరకు)
మహేష్ బాబు తన సినీ అరంగేట్రం తన సోదరుడు రమేష్ బాబు నటించిన నీడ చిత్రంలో చిన్న పాత్రతో మొదలు పెట్టారు.
1983లో ప్రముఖ దర్శకుడు కోడి రామకృష్ణ మనవి మేరకు పోరాటం సినిమాలో తన తండ్రి కృష్ణకు తమ్ముడిగా నటించారు.
ప్రముఖ దర్శక-నిర్మాత డూండీ ఆ చిత్రంలో మహేశ్ నటన చూసి అతను కృష్ణ గారి అబ్బాయి అని తెలుసుకుని ఆశ్చర్యపోయి ఆ అబ్బాయికి మంచి భవిష్యత్తు ఉంది అని కితాబు ఇచ్చారు.
అయన ఊహించిన విధంగానే బాల నటుడిగా తెలుగు ప్రేక్షకుల మెప్పు పొంది, 1987లో తొలిసారిగా తన తండ్రి దర్శకత్వం వహించిన శంఖారావం చిత్రంలో నటించారు.
1988 లో విడుదలైన, కోదండరామిరెడ్డి దర్శకత్వం వహించిన బజార్ రౌడీ చిత్రంలో అన్నయ్య రమేష్ తో కలిసి నటించారు.
1988లో మరల తన తండ్రి, అన్నయ్యలతో కలిసి ముగ్గురు కొడుకులు సినిమాలో నటించారు.
1989 లో మరోసారి తన తొలి చిత్ర దర్శకుడు కోడిరామకృష్ణ తీసిన గూడచారి 117 చిత్రంలో నటించారు.
1989 లో విడుదలైన కొడుకు దిద్దిన కాపురం చిత్రంలో మహేష్ మొదటిసారిగా ద్విపాత్రభినయం చేసారు.
1990లో విడుదలైన బాలచంద్రుడు, అన్న - తమ్ముడు సినిమాతో బాలనటుడిగా తన తొలిఇన్నింగ్స్ ని ముగించారు.
మహేష్ బాబు నటనాజీవితం తన తండ్రి చిత్రాలలో బాలనటుడిగా ప్రారంభమయ్యింది.
ఆ తరువాత విద్య మీద దృష్టి కేంద్రీకరించడం కోసం మహేష్ సినిమాలకు దూరంగా ఉన్నాడు.
డిగ్రీ పూర్తి అయ్యాక తిరిగి సినిమారంగానికి వచ్చాడు.
హీరోగా మహేశ్ తొలి చిత్రం రాజకుమారుడు. ఆ తర్వాత వచ్చిన యువరాజు, వంశీ చిత్రాలు పెద్ద విజయాల్ని సాధించకపోయినా మహేష్ నటనకు గుర్తింపు లభించింది.
2001లో సోనాలి బింద్రే హీరోయిన్ గా కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన మురారి చిత్రం మహేష్ కు తొలి భారీ కలెక్షన్స్ ని అందించింది. కానీ 2002 సంవత్సరం విడుదల అయిన టక్కరి దొంగ, బాబీ సినిమాలు రెండూ పరాజయం పాలయ్యాయి మహేష్ కు అసంతృప్తి మిగిల్చాయి.
2003లో మహేష్ కు విజయం లభించింది. గుణశేఖర్ దర్శకత్వంలో వచ్చిన ఒక్కడు చిత్రం 2003వ సంవత్సరానికి బ్లాక్ బస్టర్ గా నిలచింది. భూమిక కథానాయికగా, ప్రకాష్ రాజ్ విలన్ గా వచ్చిన ఈ చిత్రం ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని మహేష్ సినీ జీవితంలో మైలురాయిగా నిలచింది.
2003లోనే విడుదల అయిన నిజం చిత్రం ప్లాప్ అయినప్పటికీ మహేష్ నటనకు సర్వత్రా ప్రశంసలు లభించాయి.
ఈ చిత్రంలో నటనకుగాను మహేష్ ఉత్తమ నటునిగా రాష్ట్ర ప్రభుత్వపు నంది పురస్కారాన్ని అందుకున్నాడు.
2004లో తమిళనాట విజయవంతమైన న్యూ చిత్రం మహేష్ ముఖ్యపాత్రధారిగా తెలుగులో నానిగా రీమేక్ చేశారు.
మహేష్ నటనకు విమర్శకుల ప్రశంసలు లభించినప్పటికీ ఈ చిత్రం మాత్రం బాక్సాఫీసు వద్ద ప్లాప్ పాలయ్యింది.
అదే ఏడాది విడుదలైన అర్జున్ ప్లాప్ కానప్పటికీ అంచనాలను అందుకోలేదు.
18కోట్ల ఖర్చుతో నిర్మించిన ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసుకుంది.
మహేష్ తొలిదశలో సినిమాలు అభిమానులు ఆశించినంత ఆడలేదు.
పోకిరీ తరువాత వచ్చిన సైనికుడు చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయ్యింది. తొలిదశలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం బాక్సాఫీసు వద్ద బోల్తాపడింది.
ఆ తరువాత వచ్చిన అతిథి చిత్రం భారీ అంచనాల మధ్యన విడుదల అయినా, తొలినాళ్ళలో మంచి వసూళ్ళు రాబట్టినప్పటికీ ఈ చిత్రం ఒక మోస్తరు విజయాన్ని మాత్రమే నమోదు చేసింది.
అనంతరం 3 సంవత్సరాల గ్యాప్ తర్వాత భారీ అంచనాలతో విడుదలైన ఖలేజా భారీ వసూళ్లను సాధించినప్పటికీ అభిమానుల్లో భారీ అంచనాల వల్ల పెద్దగా విజయం సాధించలేదు.
కానీ, ఆ తర్వాత వచ్చిన 'దూకుడు' చిత్రం మహేశ్ కెరియర్ లోనే భారీ విజయంగా నిలిచింది.
అలాగే 'బిజినెస్ మాన్' కూడా ప్రేక్షకుల ఆదరాభిమానాలతో విజయం నమోదు చేసుకుంది.
2013 లో వేంకటేష్ గారు, మహేష్ బాబు గారు కలిసి నటించిన "సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు" విడుదలైంది. శ్రీకాంత్ అడ్డాల గారు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. తర్వాత ఆయన సుకుమార్ గారి దర్శకత్వంలో "1 నేనొక్కడినే" అనే చిత్రంలో నటించారు.
2014 సెప్టెంబరులో శ్రీను వైట్ల గారి దర్శకత్వంలో ఆయన నటించిన ఆగడు చిత్రం హాస్యం ఉన్నా అంతగా రాణించలేదు.
2015 లో వచ్చిన శ్రీమంతుడు భారీ కలెక్షన్స్ ని నమోదు చేసింది.
శ్రీకాంత్ అడ్డాల గారి దర్శకత్వంలో బ్రహ్మోత్సవం చిత్రంనిరాసనేమిగిల్చింది.
మహేష్ గారు మురుగదాస్ గారి దర్శకత్వంలో చేసిన "స్పైడర్" చిత్రం 2017 సెప్టెంబరు 27న విడుదలై మోస్తరు విజయం సాధించింది. 2018 లో కొరటాల శివ గారి దర్శకత్వంలో వచ్చిన "భరత్ అనే నేను" చిత్రం ఘన విజయం సాధించింది. అందులో మహేష్ బాబు గారు ముఖ్యమంత్రిగా నటించారు.
2019 లో వంశీ పైడిపల్లి గారి దర్శకత్వంలో మహర్షి చిత్రంలో నటించారు. కథానాయకుడిగా మహేష్ బాబు గారికి ఇది 25వ చిత్రం. ఈ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది.
Visit Government Jobs
Visit Bank Jobs
Visit Engineering Jobs
Visit Railway Jobs
Visit Latest Notifications
Visit Upcoming Notifications
Great effort
ReplyDelete